గుణశేఖర్‌కి 'జగదేకదర్శకుడు' అవార్డు!

Guna Sekhar nominated for prestigious award

01:54 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Guna Sekhar nominated for prestigious award

తెలుగు చిత్రసీమలో తనకంటూ చెరిగిపోని ముద్ర వేసుకున్న దర్శకుడు 'గుణశేఖర్‌'. భారీసెట్లు వేయించడంలో గుణశేఖర్‌ మించిన దర్శకుడు లేడంటే అది అతిశయోక్తి కాదు. బాల రామాయణంతో మెదలు పెట్టి చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్‌, సైనికుడు, వరుడు, రుద్రమదేవి వంటి చిత్రాలతో అందరినీ మెప్పించాడు. గుణశేఖర్‌ ఇటీవలే తెరకెక్కించిన రుద్రమదేవి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇప్పడు గుణశేఖర్‌ తెలుగు చిత్రసీమకి ఒక దారిని చూపించి, తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దిగ్గజ దర్శకుడు కె.వి. రెడ్డి స్మారక అవార్డుకు ఎంపికయ్యారు.

ప్రతీసంవత్సరం కళావాహిని వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ అవార్డుల్లో భాగంగా 2015 సంవత్సరానికి గుణశేఖర్‌ ఎంపికయ్యారు. 30 సంవత్సరాలు నుండి ప్రతీ సంవత్సరం నిర్వహించే కె.వి. రెడ్డి స్మారక అవార్డులకి విపరీతమైన ఖ్యాతి ఉంది. హైదరాబాద్‌లో డిసింబర్‌ 13న ఈ అవార్డు ప్రధాన కార్యక్రమానికి ఎంతోమంది సినీ దిగ్గజాలు, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. వీళ్లందరి సమక్షంలో దర్శకరత్న దాసరి నారాయణరావు చేతుల మీదుగా గుణశేఖర్‌ ఈ అవార్డును అందుకోబోతున్నాడు. అలాంటి గొప్ప దర్శకుడి స్మారక అవార్డుకి ఎంపికైనందుకు చాలా గర్వంగా ఉందని గుణశేఖర్‌ ఈ సందర్భంగా చెప్పారు.

English summary

Guna Sekhar nominated for prestigious award. This award will receive on December 13th in Hyderabad.