కారుతో భీభత్సం చేసిన గుణశేఖర్ భార్య

Guna Sekhar Wife Car Accident In Hyderabad

11:19 AM ON 11th March, 2016 By Mirchi Vilas

Guna Sekhar Wife Car Accident In Hyderabad

సూపర్ డూపర్ హిట్ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ సినిమాల్లో కూడా చూపని విధంగా ఆయన భార్య ఓ చిత్రాన్ని చూపిందట. అది మామూలు చిత్రం కాదు భీభత్సం ... దీంతో ఆమె అనూహ్యంగా వార్తల్లోకి వచ్చారు. దీనికి కారణం ఒక రోడ్డు ప్రమాదం. గుణశేఖర్ భార్య రాగిణి నడుపుతున్న కారు హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలో బీభత్సం సృష్టించిందట. ఈ ఇష్యూ గురించి పూర్తిస్థాయి వివరాలు మాత్రం బయటకు రాలేదు. అయితే రాగిణి కారు అదుపు తప్పిన కారణంగా పలుకార్లు ధ్వంసం అయినట్లు చెబుతున్నారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఆమె కారు అదుపు తప్పడంతో ఆ కారుకి ముందు వెనుక ప్రయాణిస్తున్న పలు కార్లు ధ్వంసమయ్యాయని.. అదృష్టవశాత్తు కార్లలో ఉన్న వారెవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని.. అందరూ క్షేమంగా ఉన్నట్లు తెలియ వచ్చింది. మొత్తానికి దియేటర్ కి వెళ్లక్కర్లేకుండా ఈమె రోడ్డు మీదే సినిమా చూపిందని గుగుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary

Tollywood Director Gubna Sekhar wife came into news with a car accident in Madhapur In Hyderabad.Her car gets Out of control and some cars have been destroyed. No one was injured in this incident.