గోనగన్నారెడ్డి ని తెరకెక్కించనున్న గుణశేఖర్‌

GunaSekhar Next Movie

03:22 PM ON 30th November, 2015 By Mirchi Vilas

GunaSekhar Next Movie

ప్రముఖ సినీ దర్శకుడు నిర్మాత గుణశేఖర్‌ తన తదుపరి చిత్రంగా గోనగన్నారెడ్డిని తెరకెక్కించనున్నాడు . సినిమా పట్ల గుణశేఖర్ కు ఉన్న అంకిత భావం తనకు ఉన్న ఫ్యాషన్‌ అంతా ఇంతా కాదు వరుసగా అనేక ఫ్లాప్‌లు వస్తున్నా తన పై ఉన్న నమ్మకంతో వ్యయప్రయాసల కూర్చి తానే సొంతంగా దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం రుద్రమదేవి. రుద్రమదేవి చిత్రంతో అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు గుణశేఖర్‌. రుద్రయదేవి చిత్రం చివరలో ప్రతాపరుద్ర' అనే చిత్రాన్ని రుద్రమదేవికి రెండో పార్టుగా తీస్తానని గుణశేఖర్‌ చెప్పాడు. అయితే ఇది ఇప్పట్లో కార్యరూపం దాల్చే పరిస్థితులు కనబడడం లేదు . అయితే దిల్‌రాజు నిర్మాణంలో గోనగన్నారెడ్డి చిత్రాన్ని గుణశేఖర్‌ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. గోనగన్నారెడ్డిగా ఓ స్టార్‌ హీరో కనిపించబోతున్నట్లు సమాచారం...అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.

English summary

Director Gunasekhar to do movie named Gona Ganna Reddy.Producer and disatributer dil raju to produce this movie