శాతకర్ణి మినహాయింపుపై రుద్రమదేవి రచ్చ

Gunasekhar open letter to AP CM CBN

11:09 AM ON 11th January, 2017 By Mirchi Vilas

Gunasekhar open letter to AP CM CBN

సినిమా అన్నాక అది వినోదమే అయినా చారిత్రాక , సామాజిక అంశాలు ఇమిడి వుండే చిత్రాలు వస్తున్నాయి. గతంలో చాలానే సినిమాలు ఇలాంటి వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ మధ్య రుద్రమదేవి సినిమా భారీ స్థాయిలో వచ్చింది. ఇప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణి వస్తోంది. అయితే రుద్రమ దేవి మూవీకి ఇవ్వని వినోదపు పన్ను రాయితీ శాతకర్ణికి ఇవ్వడం ఇప్పుడు పెద్ద చర్చ కు దారితీసింది. ఈమేరకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకి రుద్రమదేవి డైరెక్టర్ గుణశేఖర్ రాసిన లేఖ ఫిల్మ్ సర్కిల్స్ లోనేకాదు, అటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయింది. రచ్చ కూడా అవుతోంది. తాను స్వీయదర్శకత్వంలో నిర్మించిన రుద్రమదేవి సినిమాకు ఎపి సర్కారు వినోదంపన్ను రద్దు చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ... తాను కట్టిన వినోదపు పన్నును తిరిగి తనకు వెనక్కి ఇవ్వాలంటూ గుణశేఖర్ చంద్రబాబుని ఆలేఖలో డిమాండ్ చేసారు.

అయితే, అప్పట్లో ఎపి సర్కారు ఎందుకు రుద్రమదేవి సినిమాకి పన్నుమినహాయింపు ఎందుకు ఇవ్వలేదు..ఇవ్వలేకపోవడానికి కారణాలేంటి? తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మినహాయింపు ఇచ్చినాకూడా చంద్రబాబు ఎందుకు ఆపని చేయలేదన్నది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్లు. అయితే, బాలకృష్ణ సినిమా గౌతమిపుత్రశాతకర్ణికి మొదట వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చింది తెలంగాణ సర్కారు. ఆ తర్వాతే, ఎపి ప్రభుత్వం ఎపి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తాయని ముందే భావించిన చంద్రబాబు తెలంగాణ సర్కారు ఓకే అన్నతర్వాతే పన్ను మినహాయింపు ఇచ్చారని మరికొందంటున్నారు. అయితే, రుద్రమదేవి సినిమా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నేపథ్యంకాబట్టే కెసిఆర్ మినహాయింపునిచ్చారని, చంద్రబాబు ఇవ్వలేకపోయారన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి సినీ పరంగా నడుస్తున్న ఈ చర్చ రచ్చ గా మారితే ఇబ్బందేనని కొందరు అంటుంటే, ప్రతీ దానికి వంకలు పెట్టడం మానాలని మరికొందరు అంటున్నారు. చూద్దాం ఏమి జరుగుతుందో.

ఇవి కూడా చదవండి: వామ్మో .. వేలంలో 3 టికెట్లు.. రూ.36 లక్షలట

ఇవి కూడా చదవండి: రేపిస్ట్ లపై మండిపడ్డ హీరోయిన్…బాత్ రూమ్ కు వెళ్లినా తొంగిచూస్తుంటే మేం ఎం చేయాలి?

English summary

We all Know that Andhra Pradesh CM Chandrababu Naidu gave tax free for Balakrishna's Gautamiputra Satakarni movie and now director Guna Sekhar asks CBN that why the Government of Andhra Pradesh didn't gave tax assumption for his Rudrama Devi Movie.