మరో వైసిపి ఎంఎల్ఎ జంప్ కి రెడీ!

Guntur East MLA Mustafa to join In TDP

11:36 AM ON 26th February, 2016 By Mirchi Vilas

Guntur East MLA Mustafa to join In TDP

ఇప్పటికే 5గురు ఎంఎల్ఎ లు , ఓ ఎంఎల్సి తెలుగుదేశం గూటికి చేరిపోవడంతో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డోలాయమానంలో పడింది. తాజాగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కూడా జంప్ కాబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. దీంతో ముస్తఫాతో వైసిపి నేత బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ముస్తఫా పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతుండడంతో పార్టీ అధినేత సూచన పై బొత్స ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. పార్టీ మారొద్దని బొత్స బుజ్జగించినప్పటికీ, ముస్తఫా మాత్రం ముభావంగానే ఉన్నట్లు భోగట్టా. ఇదే కొనసాగితే టిడిపి దెబ్బకు వైసిపి కుదేలవుతుందో , స్థిరత్వం గా వుంటుందో చూడాలి .

English summary