మూగ యువతిపై రేప్‌ - ఇద్దరికి 22 ఏళ్ల జైలు

Guntur Rapists Jailed For 22 Years For Raping Mentally Disabled Woman

03:26 PM ON 17th May, 2016 By Mirchi Vilas

Guntur Rapists Jailed For 22 Years For Raping Mentally Disabled Woman

ఓ మూగ యువతిని నిర్బంధించి సామూహిక అత్యాచారం జరిపిన ఇద్దరికి గుంటూరు కోర్టు 22ఏళ్ల జైలుశిక్ష విధించింది. జిల్లా జడ్జి ఎస్‌.ఎం.రఫీ సోమవారం ఈ మేరకు తీర్పు చెప్పారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే , పేరేచర్లకు చెందిన మూగ, చెవిటి, మానసిక వికలాంగురాలైన యువతి కంటి వైద్యం కోసం 2013 ఫిబ్రవరి 3న గుంటూరుకు వచ్చింది. డాక్టర్‌ చిరునామా తెలియక వెతుకుతున్న ఆమెను.. నల్లచెరువుకు చెందిన దాసరి గౌరీశంకర్‌, షేక్‌ సుభానీ ఆస్పత్రి చూపిస్తామని చెప్పారు. ఆమెను గౌరీశంకర్‌ ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించి అత్యాచారం చేశారు. ఆమె కేకలు వేయగా పక్క ఇంట్లో నివసించే షేక్‌ గబ్బార్‌ తదితరులు రావడంతో ఇద్దరూ పరారయ్యారు. గబ్బార్‌, చుట్టుపక్కల వారు విషయం లాలాపేట పోలీసులకు తెలపడంతో పోలీసులు ఆ యువతిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తీగల దుర్గాప్రసాద్‌ ప్రత్యేక చొరవతో బాధితురాలి సాక్ష్యాన్ని వీడియోలో రికార్డ్‌ చేశారు. నిందితుల నేరం రుజువు కావడంతో వారికి 22 ఏళ్ల జైలు శిక్ష, 5వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వానికి జిల్లా జడ్జి సూచించారు.

ఇవి కూడా చదవండి:భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగితే ఇక అంతే

ఇవి కూడా చదవండి:అబ్బో , బూతు చూస్తే భక్తి పొంగిపోతుందట.?

ఇవి కూడా చదవండి:మీలో సెక్స్ కోరికలను తగ్గించే ఆహార పదార్ధాలు

English summary

A Mentally Disabled woman was kidnapped and raped by two persons in Guntur and Later Guntur District jailed them for 22 years . This incident shocked everyone in Guntur.