'గుప్పెడంత ప్రేమ' సినిమా రివ్యూ ...

Guppedantha prema movie review

01:42 PM ON 17th June, 2016 By Mirchi Vilas

Guppedantha prema movie review

ఈవేసవి ముగింపులో వర్షాకాల ప్రవేశ వేళ విడుదలైన సినీ సందడి నెలకొంది. ఇందులో భాగంగా శుక్రవారం విడుదలైన 'గుప్పెడంత ప్రేమ' సినిమా వివరాల్లోకి వెళ్తే, సాయిరోనక్ .. అతిథి సింగ్ .. ఐశ్వర్య.. ఆనంద్ .. నవీన్ నేలి.. అభిలాష్ తదితరులు తారాగణం గా వున్న ఈసినిమాకు నవనీత్ సుందర్ సంగీతం, సంజయ్ లోక్ నాథ్ ఛాయాగ్రహణం అందించారు. వనమాలి.. శ్రీమణి పాటలు రాసారు. ఐ వింక్ ప్రొడక్షన్స్ నిర్మాణం లో రూపుదిద్దుకున్న ఈ సినిమా కు వినోద్ లింగా రచన - దర్శకత్వం అందించారు.

ఆనాటి లైలా మజ్ను , పార్వతి దేవదాసు మొదలుకొని ఎన్నో ప్రేమకధా చిత్రాలు టాలివుడ్ లో వస్తూనే వున్నాయి. ఎన్ని ప్రేమ కదా సినిమాలు వచ్చినా ఇంకా వస్తూనే వున్నాయి. ఎందుకంటే ప్రేమకథని ఎవరెన్నిసార్లు చెప్పినా ఏదో ఓ కొత్త కోణం ఆవిష్కరించే ప్రయత్నం ఉంటుది. ఒకవేళ పాత కథనే చెప్పినా.. దాన్ని కొత్తగా తీర్చిదిద్ది మెప్పిసున్నారు కూడా. స్వచ్ఛమైన ప్రేమ భావనలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుందని ఎన్నోచిత్రాలు రుజువు చేశాయి. చలన చిత్ర చరిత్రలో గొప్ప ప్రేమకథలన్నీ ఎప్పుడూ సాదాసీదాగానే ఉంటాయి. కానీ వాటిని తీర్చిదిద్దిన విధానం త్రిల్ గా వుంటుంది. అలాంటి కథల్ని, చిత్రాల్ని, ఆ విజయాల్ని స్ఫూర్తిగా తీసుకొని తీసిన సినిమా 'గుప్పెడంత ప్రేమ'.

ఈ సినిమా కథ గురించి ఓసారి ప్రస్తావిస్తే, ప్రేమ కదా చిత్రాలు అనగానే హీరో హీరోయిన్లు కొంత గ్లామర్ తప్పని సరి. అందునా హీరోయిన్ అంటే గ్లామర్ వుండి తీరాలి. ఈ సినిమాలో హీరో సాయి బానే ఉన్నాడు. తన నటన పరంగా వంక పెట్టలేం. ఎనర్జీ బాగుంది. డాన్సుల్లోనూ సూపర్బ్. ఇక హీరోయిన్ అతిథి సింగ్ మాత్రం నిరాశ పరిచిందనే చెప్పాలి.. ఆ పాత్రతో ఐడెంటిఫై కాలేం. ఇక ఐశ్వర్య హుషారుగా కనిపించింది. ఆనంద్ కేవలం ఒకట్రెండు సన్నివేశాలకే పరిమితం అయ్యాడు. ప్రతి సన్నివేశాన్నీ ఓ పెయింటింగ్ లో చూపించడం ప్రత్యేకత. లొకేషన్లు కొత్తగా అనిపిస్తాయి. పాటలు వినడానికి బాగున్నా... ఇంచుమించు అన్నీ ఒకే మూసలో సాగాయి. ఇక సినిమాలో వరుస పాటలు పెట్టడం అతకలేదు. ఓ విధంగా బోర్ కొట్టించాయి. నేపథ్య సంగీతంలో హోరు మోతాదు పెంచేశారు.

ఈ సినిమాకు హీరో సాయిరోనక్ ఎసెట్ గా నిలిచాడు. కెమెరా అదిరింది.కాకపొతే కథనం నీరసంగా సాగింది. కీలకమైన ఎంటర్ టైన్ మెంట్ మిస్సయింది.

మొత్తానికి గుప్పెడంత ప్రేమ.. గుండెల్లో దాచుకొనేంత గొప్పగా లేదని ప్రేక్షకుల కామెంట్లు పడిపోతున్నాయి.మరి ఈ సినిమా ఎంతవరకూ క్లిక్ అవుతుందో వేచి చూడాలి.

Reviewer
Review Date
Movie Name Guppedantha Prema Telugu Movie Review and Rating
Author Rating 2/ 5 stars

English summary

Guppedantha Prema is a latest romantic film. Guppedantha prema movie Directed by vinod Ligala and Produced Eye Wink Productions.