అజారుద్దీన్ తో ఎఫైర్ పై స్పందించిన గుత్తా జ్వాల

Gutta Jwala responds on affair between Azharuddin

11:22 AM ON 12th May, 2016 By Mirchi Vilas

Gutta Jwala responds on affair between Azharuddin

భారత జట్టు క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తో భారత షటిల్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకి అఫైర్ ఉన్నట్లు గత కొంతకాలం క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వార్త సంచలనం రేపింది. కాగా తాజాగా.. సూరత్ లో ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించేందుకు వెళ్ళగా.. గుత్తా జ్వాల పై మీడియా అదే ప్రశ్న సంధించింది. దీనితో అజారుద్దీన్ తో అఫైర్ పై గుత్తా జ్వాల మరో సారి ఘాటుగా సమాధానం ఇచ్చింది. ‘అదంతా ఓ రూమర్. మీరంతా పదే పదే అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? దీని పై గతంలో ఎన్నోసార్లు ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాను కదా. వదిలిపెట్టరా?’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

త్వరలో విడుదల కానున్న అజారుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చిత్రం ‘అజర్’ లో గుత్తా జ్వాల పాత్ర కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం పై ఇప్పటికే పలువురు సీనియర్ క్రికెటర్ లు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

English summary

Gutta Jwala responds on affair between Azharuddin. Hot player Gutta Jwala responds on affair between Azharuddin.