పద్మ అవార్డులపై గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు

Gutta Jwala Sensational Comments On Padma Awards 2017

11:31 AM ON 26th January, 2017 By Mirchi Vilas

Gutta Jwala Sensational Comments On Padma Awards 2017

భారత్ లో ప్రతి ఏడాది రిపబ్లికేడే రోజున పద్మ అవార్డులు ప్రకటించడం రివాజే. అనుకున్నట్టే ప్రకటించారు. బ్యాట్మింటన్ క్రీడాకారిణుల్లో సైనా నెహ్వాల్, సింధూలకు, టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు పద్మ అవార్డులు వచ్చాయి. కానీ బ్యాట్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాకు మాత్రం ఇప్పటివరకూ పద్మ అవార్డు రాలేదు. ఈ ఏడాది కూడా పద్మ అవార్డుల లిస్ట్ లో తన పేరు లేకపోవడంపై ఆమె మనస్థాపానికి గురైంది. గత మూడు సంవత్సరాలుగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉంది. తాను ఎన్ని సాధించినా అవేమీ తనకు పద్మ అవార్డు రావడానికి సరిపోవడం లేదని వాపోయింది. తాను 15 సంవత్సరాలుగా దేశానికి ఆడుతున్నానని, ఎన్నో టోర్నమెంట్ లను గెలిచానని వివరిస్తూ ఒక లెటర్ ను సోషల్ మీడియాలో పెట్టింది. తాను ఎన్ని సాధించినా ఈ ప్రతిష్టాత్మక పద్మ అవార్డు తనకు ఎందుకు రావడంలేదో అర్ధం కావడం లేదని వాపోయింది. అందుకు కారణం తాను ఓపెన్ గా బయటకు మాట్లాడమేనని కూడా గుత్తా జ్వాల చెబుతూ అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.

ఇక సైనా, సింధూ, సానియా, గుత్తా జ్వాలా పొందిన అవార్డుల వివరాలు..

సైనా నెహ్వాల్ : అర్జున(2009), పద్మశ్రీ(2010), రాజీవ్ గాంధీ ఖేల్ రత్న(2009-10), పద్మ భూషణ్(2016)

సానియా మిర్జా : అర్జున(2004), పద్మశ్రీ(2006), రాజీవ్ గాంధీ ఖేల్ రత్న(2015), పద్మ భూషణ్(2016)

పీవీ సింధూ : అర్జున(2013), పద్మశ్రీ(2015), రాజీవ్ గాంధీ ఖేల్ రత్న(2016)

గుత్తా జ్వాలా : అర్జున(2011).

English summary

Indian Doubles Badminton Player Gutta Jwala made some sensational comments on Padma Awards which have been announced on the eve of Indian republic Day. She said that she is hurt after Padma award snub.