రాజు గారి డైనింగ్ టేబుల్ పై రైలు ….వంటకాలన్నీ అందులోనేనట (వీడియో)

Gwalior Moving Train Dining Table In Jai Vilas Palace

10:53 AM ON 18th January, 2017 By Mirchi Vilas

Gwalior Moving Train Dining Table In Jai Vilas Palace

అనగనగా ఓ రాజు అంటూ కధలు చెప్పుకోవడం తెలుసు కదా. అయితే మనం ఇప్పుడు చెప్పుకునే రాజు పేరు జీవాజీ రావ్ స్కిండియా…. గ్వాలియర్ ను పరిపాలించిన రాజుల వంశానికి చెందిన వాడు. ఈయన పరిపాలన గురించి కాస్త పక్కకు పెడితే ఈయన డైనింగ్ టేబుల్ మాత్రం అప్పట్లో హల్ చల్ చేసిందట.. తాజాగా ఈరాజా వారి డైనింగ్ టేబుల్ గురించి మరోసారి చర్చ జరుగుతుంది. ఇంతకీ ఆ డైనింగ్ టేబుల్ ప్రత్యేకత ఏంటంటే, రాజా గారి డైనింగ్ టేబుల్ మీద ఓ చిన్నపాటి రైలు ఉండేదట. నిజం ట్రైన్ మాదిరిగానే దానికి ఓ 7 బోగీలు కూడా ఉండేవట. ఒక బోగీలో అన్నం, మరో బోగీలో కూర, మరో బోగీలో మద్యం, మరో బోగీలో సిగరెట్స్. మరో బోగీలో పచ్చడి..ఇలా ఒక్కొక్క బోగీలో ఒక్కో రకం తినడానికి సంబంధించిన ఐటమ్స్ తో ఆ బోగీలు నిండి ఉండేవట .

రాజు గారి కోసం వచ్చిన ప్రత్యేక అతిథులకు ….ఇక్కడే భోజనం పెట్టించే వారట ఈ రాజావారు. అందరూ వచ్చి కూర్చొని తమ సీటు పక్కనే ఉన్న బటన్ ను నొక్కగానే ట్రైన్ వచ్చిస్విచ్ నొక్కిన వారి దగ్గరికి వచ్చి ఆగుతుందట…సదరు వ్యక్తి తనకు కావాల్సిన ఐటమ్స్ వేసుకొవొచ్చు..ఇంతలో మరో వ్యక్తి స్విచ్ నొక్కగానే అక్కడికి బయలు దేరుతుంది ఈ ట్రైన్..ఇలా ఎవరికి కావాల్సిన ఐటమ్స్ ను వారికి చేరవేస్తూ డైనింగ్ టేబుల్ చుట్టూరా చక్కర్లు కొట్టేదంట…ఈ ట్రైన్.

సర్వెంట్స్ ఉన్నప్పటికీ ఈ ట్రైన్నే ఎందుకు వాడారు అంటే ఆన్సర్ కూడా ఉన్నాయి…ఈ రాజావారి డైనింగ్ టేబుల్ చాలా పెద్దది….ఒకేసారి 150 మంది దాకా కూర్చొని బోంచేయొచ్చు.. అంత మంది డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే సర్వ్ చేయడం కష్టం. హడావుడిలో సర్వ్ చేసే పదార్థాలు మీదపడడం, ప్రతి చిన్న దానికి సర్వెంట్స్ ను పిలవడం…ఈ బాధలన్నీ ఉండవని ఇలా తయారు చేయించాడట ఈరాజా గారు.

మంచి ఐడియా కదా, మరి .మన హోటల్స్ ఈ ఐడియా కాపీ కొడితే వ్యాపారం మస్త్ మస్త్ గా సాగిపోతుందని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి: చెప్పుల పై మహాత్మాగాంధీ బొమ్మలు : అమెజాన్ దురహంకారం

ఇవి కూడా చదవండి:పాకిస్థాన్ బాహుబలి -- ఇంతకీ ఇతని బరువు తెలిస్తే షాకవుతారు

English summary

Jai Vilas palace museum was very famous in India and the main attraction of that museum was a moving train Dining table. This was placed here by the Gwalior King in Past Days and this was very famous not only in India also famous around the world.