జిమ్నాస్ట్ లో ఫైనల్ కి చేరిన దీపా..

Gymnast Deepa goes to final in Rio Olympics

02:45 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Gymnast Deepa goes to final in Rio Olympics

అవును, ఒలింపిక్స్ లో గత 52 ఏళ్లుగా భారతీయుల కలగా మిగిలిన జిమ్నాస్ట్ విభాగంలో ప్రాతినిథ్యం వహిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించిన దీపా కర్మాకర్ అంచనాలను అందుకుని ఫైనల్ కు చేరుకుంది. కెరీర్ లో తొలి ఒలింపిక్ ఆడుతున్న దీపా మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ క్వాలిఫికేషన్ లో సత్తా చాటి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో టాప్-8 జిమ్నాస్ట్స్ ఫైనల్ చేరుతారు. ప్రొడునొవాలో ఆరితేరిన దీపా పోటీల్లో భాగంగా జరిగిన వాల్ట్ విభాగంలో 14.850 పాయింట్లతో సత్తా చాటింది. తొలి ప్రయత్నంలోనే 15.100తో దూసుకెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచినా, రెండో ప్రయత్నంలో 14.600తో అభిమానుల్ని కాస్త కంగారు పెట్టింది.

అయితే చివరికి ఎనిమిదో స్థానంలో నిలిచి ఆగస్టు 14న జరగనున్న ఫైనల్ ల్లో పతక వేటకు సిద్ధమైంది. హాట్స్ ఆఫ్ దీపా..

1/3 Pages

దీపా ఎంట్రీయే ఓ అద్భుతం...

రియో ఒలింపిక్స్ లో అన్ని ఈవెంట్లు ఒక ఎత్తైతే దీపా కర్మాకర్ బరిలోకి దిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ మరో ఎత్తు. ఇప్పటివరకు ఒలింపిక్స్ లో ఈ విభాగంలో భారత్ ఒక అథ్లెట్ ను కూడా పంపలేకపోయింది. అమెరికా, జపాన్ లాంటి అగ్రదేశాలతో కఠిన పోటీ ఉండే ఈ విభాగంలో సత్తా చాటేందుకు రోజుకు ఎనిమిది గంటలకుపైగా దీపా శ్రమించింది. ఇప్పటికే కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం గెలిచిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్ గా అరుదైన రికార్డు సృష్టించిన దీపా కెరీర్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 77 పతకాలు గెలిచింది. అందులో 67 బంగారు పతకాలు ఉన్నాయంటే మామూలు విషయం కాదు.

English summary

Gymnast Deepa goes to final in Rio Olympics