దీపాకు ఖేల్ రత్న ఇవ్వబోతున్నారా!

Gymnast Dipa Karmakar in Line For Khel Ratna

10:34 AM ON 18th August, 2016 By Mirchi Vilas

Gymnast Dipa Karmakar in Line For Khel Ratna

రియో-2016 ఒలింపిక్స్ లో తనదైన ప్రదర్శనతో భారతీయుల హృదయాలను జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ గెలిచిన సంగతి తెల్సిందే. అందుకే అరుదైన పురస్కారం ఇవ్వాలని కేంద్రం భావిస్తోందట.

ఒలింపిక్స్ లో పతకం చేజారినా ఆమె చేసిన విన్యాసాలు కోట్లాది మంది భారతీయులను ఆకట్టుకున్నాయి. ఈ విషయంలో ఆమెకు అవార్డ్ ఇవ్వాల్సిందేనంటూ చాలామంది క్రీడాకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 23 ఏళ్ల దీపాను ఖేల్ రత్న పురస్కారానికి ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు టాక్ వినిపిస్తోంది.

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డ్ ని ఇవ్వనున్న ట్లు అప్పుడే వార్తలు గుప్పుమంటున్నాయి.

ఇక దీప కోచ్ బిశ్వేశ్వర్ కు ద్రోణాచార్య ఇవ్వాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. మరోపక్క రియోలో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఎనిమిదో స్థానంలో నిలిచిన షూటర్ జితూరాయ్ కు కూడా ఖేల్ రత్న ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నెటిజన్లు కూడా ఈ పురస్కారాల విషయంలో సానుకూల స్పందన వ్యక్తంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:ప్రపంచంలో శివలింగం కనిపించని ఏకైక శివాలయం ఎక్కడుందో తెలుసా?

ఇవి కూడా చదవండి:ఇలాంటి తెలివైన స్టంప్ ఎప్పుడైనా చూసారా(వీడియో)

English summary

Indian Gymnast Dipa Karmakar was attracted people of India by her feets in Rio Olympics and she was the first gymnast to get qualify for Olympics. Recently a news came to know that She was to be awarded by "Khel Ratna" award by Indian Government. But there was no official announcement on this news.