హీరో విక్రమ్ అలవాట్లు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Habbits of Vikram

10:13 AM ON 29th August, 2016 By Mirchi Vilas

Habbits of Vikram

ఒక్కో హీరోది ఒక్కో శైలి. అందునా 'అపరిచితుడు'తో నటనలోని తన విశ్వరూపాన్ని చూపించి.. ప్రయోగాలకు 'ఐ'కాన్ గా మారిన హీరో విక్రమ్ ది డిఫరెంట్ స్టైల్. ప్రస్తుతం 'ఇరుముగన్' పేరుతో సినీప్రియుల ముందుకు రాబోతున్న విక్రమ్ ఎప్పుడూ భిన్నత్వాన్ని కోరుకోవడం తనకిష్టమని అంటుంటాడు. ఇక చిన్నప్పటి నుంచే నటుడునవ్వాలని తనకు ఉండేదని విక్రమ్ చెబుతుంటాడు. ఫలానా పాత్ర చేయాలని, ఫలానా వారి దర్శకత్వంలో నటించాలని కలలు కనేవాడట. తండ్రి సినీనటుడు కావడం వల్లే చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెరిగిందని చెప్పే విక్రమ్ దగ్గర ఎన్నో విషయాలున్నాయి. వాటన్నిటిని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

నాన్న చిన్నచిన్న పాత్రలే చేశారు. అయినా తన రూపు, టాలెంట్ వల్లే ఈ స్థాయికి వచ్చావని నాన్న అంటుంటారు అని విక్రమ్ సరదాగా చెప్పాడు. పెళ్లి చూపుల సమయంలో సినిమా అవసరమా అని వాళ్లు అంటే.. 'సారీ.. మొదట సినిమా, ఆ తర్వాతే భార్య..' అని చెప్పాడట ఈ హీరో. ఫైట్ అయినా, వేరే దేనికయినా మేకప్ వాడటం విక్రమ్ కి అసలు ఇష్టం ఉండదట. అందుకే 'ఐ' సినిమాకు పడిన కష్టం మాటల్లో చెప్పలేనని అంటున్నాడు. 'అంతకు మించి' డైలాగ్ ను ఆ టోన్ లో చెప్పడం చాలా కష్టమయిందని చెప్పాడు. విక్రమ్ లో మంచి నటుడు దాగివున్నా, స్టార్ హీరో అయినా సరే, తాను స్టార్ ని కాదని, నటుడినని వినమ్రంగా చెబుతుంటాడు.

ఎవరయినా వచ్చి ఆటోగ్రాఫ్ అడిగితే కన్నీళ్లు వస్తాయని, థాంక్స్ చెప్పి.. వెంటనే దాన్ని తీసుకుని ఆటోగ్రాఫ్ పెట్టేస్తుంటానని అంటున్నాడు. ఇంతకీ విక్రమ్ అలవాట్లు ఏమిటో తెలుసా! ఫోటోగ్రఫీ, నిద్ర, తినడం తన అలవాట్లుగా చెప్పాడు.

English summary

Habbits of Vikram. Veteran actor Chiyaan Vikram talks about his habbits and personal life. And also about his movie carrier with media.