ఎల్ఈడీ లైట్లతో కూడా హ్యాక్ చేసేస్తున్నారట!

Hackers are hacking with LED lights

12:35 PM ON 7th November, 2016 By Mirchi Vilas

Hackers are hacking with LED lights

ఎల్ఈడీ బల్బులు వాడితే, కరెంట్ ఆదా అవుతుందని అంటున్నారు కదా. అందుకోసమే ప్రభుత్వం అతిచౌకగా ఎల్ఈడీ బల్బులను అందించింది. అయితే ఇప్పడు దీనిపై రకరకాల వార్తలు హల్ చల్ చేసేస్తున్నాయి. ఇంట్లో లైట్ ఆన్ చేయడానికి కూడా భయపడే రోజులు వచ్చేశాయ్! ఎక్కడ వీలు కుదిరితే అక్కడ వైరస్ గుప్పించేందుకు దూసుకొస్తున్న హ్యాకర్లే దీనికి కారణం. డిజిటల్ బల్బులు, లైట్లు, స్విచ్చుల వంటి స్మార్ట్ వస్తువుల్లోని వైర్ లెస్ టెక్నాలజీ ఆధారంగా సైబర్ దాడులు జరిపేందుకు అవకాశాలు ఉన్నట్టు తాజా పరిశోధనలో వెల్లడయిందని అంటున్నారు. ఫిలిప్స్ హ్యూ స్మార్ట్ బల్బుల్లోని వైర్ లెస్ టెక్నాలజీ సైబర్ దాడులకు సహకరిస్తున్నట్టు సాంకేతిక నిపుణులు బయటపెట్టారు.

1/4 Pages

హ్యాకర్లు ఇంట్లోని లైట్లు, స్విచ్చులు, లాక్స్, థర్మోస్టాట్స్ సహా అన్ని స్మార్ట్ డివైజ్ లను తమ స్వాధీనంలోకి తీసుకోగలరని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ లోని వైజ్ మన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, కెనడాలోని డల్హౌసీ యూనివర్సిటీ పరిశోధకులు ఈ మేరకు ఓ వార్తాపత్రికలో తమ పరిశోధన వివరాలను వెల్లడించారు. హ్యాకర్లకు ఇలాంటి అవకాశం ఉన్నందున ఇంటర్నెట్ తో కనెక్టయి ఉన్న వేలాది స్మార్ట్ వస్తువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చునని అంటున్నారు.

English summary

Hackers are hacking with LED lights