హిల్టన్‌ హోటల్‌ను హ్యాక్‌ చేసారు

Hackers hacked to Hilton Hotel Chain

08:55 AM ON 25th November, 2015 By Mirchi Vilas

Hackers hacked to Hilton Hotel Chain

యుఎస్‌లోని ప్రముఖ హోటల్‌ చైన్‌ అయిన హిల్టన్‌ గ్రూపుకు చెందిన హోటల్‌ను హ్యాకర్లు హ్యక్‌ చేసారట. హోటల్‌లో కస్టమర్ల నుండి డబ్బులు వసూలు చేసే క్రెడిట్‌కార్డు మెషీన్‌ నుండి సమాచారాన్ని హ్యాక్‌ చేసిన హ్యాకర్లు ఎంత మొత్తంలో కొల్లగొట్టారో ఇంకా తెలియరాలేదు. కానీ హ్యాక్‌ జరిగిన విషయాన్ని ధృవీకరించని హిల్టన్‌ తమ హోటల్‌ ద్వారా గత ఏడాది నవంబర్‌ 18 నుండి డిసెంబర్‌ 5 తేదీల మధ్య లావాదేవీలు జరిపిన ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాల్లో ఏమైనా అనుమానాస్పదంగా లావాదేవీలు జరిగాయేమో చూసుకొమ్మంటూ ప్రకటన విడుదల చేసింది.

మాల్‌వేర్‌ వైరస్‌ ద్వారా హోటల్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ వ్యవస్థలోకి చొరబడిన హ్యాకర్లు ఖాతాదారుల క్రెడిట్‌ కార్డు వివరాలు, పాస్‌వర్డ్స్‌లను దొంగిలించారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ వ్యవహారంపై అంతర్గతంగా విచారణ ప్రారంభించింది హిల్టన్‌.

గత నెలలో సరిగ్గా ఇలాంటి హ్యకింగ్‌ ఘటనే అమెరికాకు చెందిన మరో హోటల్‌ చైన్‌ సంస్థ స్టార్‌వుడ్‌ హోటల్‌లో కూడా జరిగింది.

హోటల్స్‌, రెస్టారెంట్స్‌, గిఫ్ట్‌షాప్‌లలో ఉండే పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ మెషీన్స్‌ అంటే క్రెడిట్‌ కార్డ్‌ను స్వైప్‌ చేసే మెషీన్‌లను హ్యాక్‌ చేసేలా హ్యకర్లు ఒక మాల్‌వేర్‌ వైరస్‌ను సృష్టించారు. అది ఒకసారి ఆ మెషీన్‌లలో చొరబడిన వెంటనే ప్రతీ వినియోగదారుడి క్రెడిట్‌కార్డు నెంబర్లు, సీక్రెట్‌ కోడ్‌లను హ్యాకర్లకు చేరవేస్తుందట.


English summary