మరిన్ని పఠాన్‌కోట్ తరహాలో దాడులు: హఫీజ్

Hafiz Saeed warns India

09:39 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Hafiz Saeed warns India

భారత్ లో పఠాన్‌కోట్ తరహా దాడులు మరిన్ని జరుగుతాయని జైషే మొహమ్మద్ నేత హఫీజ్ సయీద్ భారత్‌ను హెచ్చరించాడు. బుధవారం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో జరిగిన బహిరంగ సభలో జైషే నేత ఈ హెచ్చరికలు చేశాడు. హఫీజ్ వార్నింగ్‌తో భారత్, పాక్ మధ్య జరగాల్సిన చర్చలు మరింత ఇబ్బందుల్లో పడే అవకాశాలున్నాయి. పఠాన్‌కోట్ దాడికి హఫీజ్ సూత్రధారి అని భారత్ తన దగ్గర ఉన్న ఆధారాలను పాకిస్థాన్‌కు అందజేసింది. కానీ పాకిస్థాన్ మాత్రం ఇప్పటి వరకు ఆ ఉగ్ర నేతను పట్టుకునే ప్రయత్నాలు చేయలేదు. టెర్రర్ గ్రూప్ జైషే మొహమ్మద్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసినా.. పాకిస్థాన్ మాత్రం హఫీజ్‌ను స్వేచ్ఛగా తిరగనిస్తోంది. అతన్ని పట్టిచ్చిన వారికి అమెరికా 10 మిలియన్ డాలర్ల పారితోషకం ఇవ్వనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

English summary

Hafiz Saeed warns India.Hafiz Saeed, alleged mastermind of the 2008 Mumbai attacks and leader of the banned Jamaat-ud-Dawa group,encouraged further violence .