ఇటలీలో ఒక్క పూట భోజనం 8 వేలు!

Half Day Meals 8 Thousand Rupees In Italy

11:48 AM ON 6th September, 2016 By Mirchi Vilas

Half Day Meals 8 Thousand Rupees In Italy

ఇది చూసి ఆశ్చర్య పోవద్దు. ఇది నిజమే. ఇంతకీ ఈవిషయం గతంలో ఓ టివి ఛానల్ ఇంటర్యూలో హాస్య నటుడు ఎం ఎస్ నారాయణ చెప్పింది మళ్ళీ ఓసారి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అంతే. అసలు అప్పడు ఏం చెప్పాడో పరిశీలిద్దాం. ‘అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్ ఇటలీ దేశం ‘మిలాన్’ నగరంలో జరిగింది. అక్కడున్న చరిత్రాత్మక ప్రదేశాలు ఆయనను ఆశ్చర్యపరిచాయి. నాలుగువందల సంవత్సరాల క్రితం కట్టిన ఓ పురాతన చర్చి వద్ద షూటింగ్ జరిగింది. ‘గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయినా...’ అనే పాటలో పవన్ కల్యాణ్ గారి సెక్రటరీగా వెంట నడుస్తున్న సీన్లు ఉన్నాయి. ఎందుకో నిర్మాతలు పెట్టిన ఫుడ్ రొటీన్ అనిపించి బయట ఇండియన్ రెస్టారెంట్ కోసం ఒకసారి వాకబు చేశా. ఆఖరికి ఒక చోట దొరికింది. ఏదో బానే అనిపించింది. కానీ బిల్లు చూస్తే గుండె ఝల్లుమంది. రూపాయల్లోకి మార్చి చూస్తే ఎనిమిది వేల దాకా ఖర్చు అయింది. ఇక రుచులు కోసం తిరగకుండా వాళ్ళ భోజనంతోనే సరిపెట్టుకున్నా' అని ఎం ఎస్ గతంలో చెప్పాడు.

ఇది కూడా చూడండి: సమంత రెండేళ్ల క్రితమే కోడలిగా ఫిక్స్ అయిందా?

ఇది కూడా చూడండి: బిజినెస్ స్టార్ట్ చేసిన బన్నీ వైఫ్!

ఇది కూడా చూడండి: వెనిజులా ప్రెసిడెంట్ ని తరిమి కొట్టేసారు ..

English summary

M.S Narayana said Half Day Meals 8 Thousand Rupees In Italy.