సగం అమెరికన్లకు ల్యాండ్‌ ఫోన్లు లేవట

Half Of The American Homes Dont Have Land Phones

05:55 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Half Of The American Homes Dont Have Land Phones

అమెరికాలోని సెంటర్స్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సిడిసి) వారు ఒక సర్వే ఫలితాలు విడుదల చేశారు. ఈ సర్వే వివరాల ప్రరారం అమెరికా జనాభాలోని సగం మందికి సెల్‌ఫోన్లు తప్ప ల్యాండ్‌ ఫోన్లు లేవట . సిడిసి వారు 21,000 ల ఇళ్ల లోని ప్రజలను ప్రశ్నించిన తరువాత అందులోని 47 శాతం మంది కేవలం సెల్‌ఫోన్లను మాత్రమే ఉపయోగిస్తున్నారట. 41 శాతం మంది సెల్‌ఫోన్లను ,ల్యాండ్‌లైన్‌ లను రెండిటిని ఉపయోగిస్తున్నారట. కేవలం 8 శాతం మంది ప్రజలు మాత్రమే ఒక్క ల్యాండ్‌ ఫోన్లను వాడుతున్నారని తెలింది. 3.4 శాతం మంది అసలు ఏ విధమైన ఫోన్లు ఉపయోగించడం లేదని తెలిపింది. వీరిలో 24-34 వయస్సు గల వారిలో 71 శాతం మంది సెల్‌ఫోన్లను మాత్రమే ఉపయోగిస్తున్నారు.

English summary

The Centers for Disease Control and Prevention (CDC) released a new survey details,the survey showing that nearly half of all American households now use only cell phones that land phones