తొలి చూపులో ప్రేమ అబద్ధమేనట

Hamilton College Research On Love At First Sight

10:56 AM ON 23rd August, 2016 By Mirchi Vilas

Hamilton College Research On Love At First Sight

ఇప్పటివరకు మనం ఓ మాట వింటూ వచ్చాం. తోలి చూపులోనే ప్రేమ పుట్టి అది వికసించి , పుష్పిస్తుందని ... కానీ తొలి చూపులో ప్రేమ పుట్టడం మిథ్య అని, ఇంకా చెప్పాలంటే అబద్ధమని తేలిపోయింది. ఎలా అంటే, ఇరువురి మధ్య ప్రేమ నాలుగో సారి కలిసినప్పుడే పుడుతుందని ఓ నూతన అధ్యయనంలో తేలింది. అమెరికాలోని హామిల్ టన్ కాలేజీ పరిశోధకులు కొంత మంది ఫొటోలను ఎంపిక చేసిన యువతీ, యువకులకు ఇవ్వగా.. వారు వాటికి వివిధ ర్యాంకులు ఇచ్చారు. ఈ సమయంలో వారి మెదడు ప్రతిస్పందనలను పరిశోధకులు అధ్యయనం చేశారు. రెండో సారి ఫొటోలను ఇవ్వగా అందులో కొందరి ముఖాలు వారికి ముందు కంటే ఆకర్షనీయంగా కనిపించాయని పరిశోధకులు చెప్పారు. మూడో సారి మరింత మరింత ఆకర్షనీయంగా, ఇక నాలుగో సారి చూసినప్పుడు అత్యంత అకర్షనీయంగా కనిపించారని యువతీ, యువకులు చెప్పారని పరిశోధకులు తెలిపారు. మొదటి సారి చూసినప్పుడే ప్రేమ పుట్టడంలేదని, పలు సార్లు కలిసిన తరువాతే ప్రేమ పుడుతుందని ఈ అధ్యయనంలో తేలిందని హ్యామిల్ టన్ కాలేజీలో మానసికవేత్త రవి తిరుచ్ సెల్వమ్ స్పష్టం చేసారు. అంటే తొలిప్రేమ వంటి టైటిల్స్ కి కాలం చెల్లిందన్నమాట.

ఇవి కూడా చదవండి:అవి లేకపోవడం వల్లే 120 ఏళ్ళుగా జీవిస్తున్నా

ఇవి కూడా చదవండి:ఫ్రెండ్స్ తో పందెం కట్టి 24 ఎనర్జీ డ్రింక్స్ తాగేశాడు.. ఆపై ఏమైందో చూస్తే భయపడతారు!

English summary

American Hamilton College Researchers made a research on Love at first Sight and these study proved that people fall in love at fourth sight. Because they made an research on brain and they noticed the excitement of their brains.