బాలయ్య పార్టీలో హంసా చిందులు!

Hamsa Nandini hot dance in Balakrishna birthday party

12:20 PM ON 23rd May, 2016 By Mirchi Vilas

Hamsa Nandini hot dance in Balakrishna birthday party

అబ్బో, డ్యాన్స్ ప్రాక్టీస్‌లో ఐటమ్ బ్యూటీ హంసానందిని బిజీ అయ్యింది. ఇంతకీ ఏ హీరోతో? ఎప్పుడు? ఎక్కడ అనేది మీ డౌట్? అక్కడికే వచ్చేద్దాం! బాలకృష్ణ తన పుట్టినరోజు(జూన్ 10న) వేడుకలను ఈసారి అమెరికాలో జరుపుకోనున్నారట. నార్మల్‌గా జరిగితే ఏముంటుందని భావించారో ఏమో అభిమానులు. ఈసారి కాస్త డిఫరెంట్‌గా ఎంటర్ టైన్‌మెంట్‌కు కాస్త టచ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా బాలయ్యకు కాలిఫోర్నియాలో గ్రాండ్‌గా పార్టీ ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు టాక్. అందుకోసం వెరైటీగా హంసానందినితో డాన్స్ షో ఏర్పాటు చేసినట్టు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మరి ఇందులో నిజమెంతో? ఈవెంట్ ద్వారా వచ్చే డబ్బును బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. పనిలోపనిగా ఈ పార్టీలో తన 100వ సినిమా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ ఫస్ట్‌లుక్‌ కూడా బాలకృష్ణ రిలీజ్ చేయనున్నట్లు టాక్.

English summary

Hamsa Nandini hot dance in Balakrishna birthday party