'కిక్' లో రవితేజాలా కోట్లు కొల్లగొట్టి పేదలకు పంచాడు..

Hamza Bendelladj died for poor people

12:44 PM ON 26th April, 2016 By Mirchi Vilas

Hamza Bendelladj died for poor people

మనం చేసే మంచి పనులతో ఒక్కోసారి మనకే కాదు, అవతలి వారికి కూడా ఏదో ఒక మంచి జరుగుతుంది. అయితే కొన్ని సార్లు మనం చేసే చెడు పనులు కూడా కొందరికి మేలే చేస్తాయి. ఈ క్రమంలో హంజా బెండలార్జ్ అనే వ్యక్తి చేసిన ఓ చెడు పనే అనేక వేల మంది పేదల బతుకుల్లో వెలుగు నింపింది. అయితే ఆ వ్యక్తి ఆ పనిని కావాలనే చేశాడు. ఇందుకు గాను ఎంతో విలువైన తన జీవితాన్నే మూల్యంగా చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంతకీ హంజా బెండలార్జ్ చేసిన పని ఏమిటి? అల్జీరియా దేశానికి చెందిన హంజా బెండలార్జ్ వృత్తి రీత్యా పేరు మోసిన కంప్యూటర్ హ్యాకర్. ఎలాంటి కంప్యూటర్‌నైనా ఇట్టే హ్యాక్ చేయగల సమర్థుడు.

1988వ సంవత్సరంలో 'స్పైఈ' అనే ఓ కొత్త వైరస్‌ను తయారు చేశాడు. దీన్ని ఆ దేశవ్యాప్తంగా ఉన్న అనేక లక్షల కంప్యూటర్లలోకి చొప్పించాడు. దీంతోపాటు అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు చెందిన ప్రభుత్వ వెబ్‌సైట్‌లకు కూడా ఆ వైరస్ వ్యాప్తి చెందేలా చేశాడు. అలా తాను క్రియేట్ చేసిన వైరస్ ద్వారా ఆయా దేశాలకు చెందిన దాదాపు 217 బ్యాంకుల్లో ఉన్న 4వేల మిలియన్ డాలర్లను దొంగిలించాడు. అయితే హంజా బెండలార్జ్ తాను దొంగిలించిన సొమ్ముతో జల్సాలు మాత్రం చేయలేదు. దాన్నంతా పేద ప్రజలకు పంచేశాడు. అధిక శాతం వరకు డబ్బును పాలస్తీనాకు చెందిన పలు చారిటబుల్ ట్రస్టులకు విరాళంగా ఇచ్చాడు.

కాగా ఆయా బ్యాంకులకు చెందిన లావా దేవీల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడంతో ఆయా దేశాలు ఈ సంఘటన పై విచారణకు ఆదేశించాయి. దీంతో అన్ని దేశాల పోలీసులు హంజా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అతను చేసిన ఫోన్ కాల్స్ ఆధారంగా థాయ్‌లాండ్ పోలీసులు జనవరి 6, 2013న హంజాను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 2013 మేలో హంజా పై అట్లాంటా జార్జియా కోర్టులో కేసు నమోదైంది. అనంతరం పలు దఫాల్లో కేసు విచారణ జరగగా హంజాను కోర్టు దోషిగా తేల్చింది. దీంతో అతనికి మరణశిక్ష పడింది. ఆన్‌లైన్ ద్వారా బ్యాంకుల వెబ్‌సైట్లలోకి చొరబడి వేల మిలియన్ డాలర్లను దొంగిలించినందుకు గానూ హంజా బెండలార్జ్‌కు ఉరి శిక్ష విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించగానే ఈ వార్త పై సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో హంజా సానుభూతి పరులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున స్పందించారు.

అతన్ని ఉరి తీయవద్దని నిరసనలు చేపట్టారు. అయినప్పటికీ పోలీసులు అతన్ని బహిరంగంగా ఉరి తీశారు. కాగా ఉరి తాడు త‌గిలించేంత వ‌ర‌కు హంజా న‌వ్వుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం. నిజంగా పేద ప్రజలకు సహాయం చేయడం కోసం హంజా చేసిన పనికి మానవత్వం ఉన్న మనుషులుగా మనం అతన్ని అభినందించినా, బ్యాంకుల్లో అతను కొట్టేసిన సొమ్ములో సాధారణ ప్రజల సొమ్ము కూడా ఉంటుంది, కాబట్టి అతని చర్యను మనం పూర్తిగా సమర్థించలేం. ఏది ఏమైనా ఇతరులకు సహాయం చేయాలన్న హంజా తపన మాత్రం కొనియాడదగినది.


English summary

Hamza Bendelladj died for poor people. Hamza Bendelladj robbers money from banks and gave that money to poor people..