అర్ధరాత్రి హన్సిక అలా చేసినందుకు మెచ్చుకోకుండా ఉండలేరు(వీడియో)

Hansika helps road side footpath people in Chennai

04:42 PM ON 13th July, 2016 By Mirchi Vilas

Hansika helps road side footpath people in Chennai

తెర పై కనిపించే హీరోయిన్లు ఎంతో అందంగా ఉండడంతో పాటు ఎంతో మంచి పనులు చేస్తూ ఉంటారు, గొప్ప గొప్ప పనులు కూడా చేస్తూ ఉంటారు, ఇతరులకు సాయం చెయ్యడంలో ముందు ఉంటారు, ఎన్నో రిస్క్ లు కూడా చేస్తారు. అయితే ఇదంతా తెరపైనే.. బయట కాదు, మనం వాళ్ళని తెరపై చూస్తున్నంత సేపు బయట కూడా ఇలాంటి అమ్మాయిలు ఉంటే ఎంతో బాగుంటుంది కదా అని అనుకుంటాము. అయితే అది బయట చాలా అరుదు. ముఖ్యంగా సినిమా హీరోయిన్లు విషయంలో అయితే ఇంకా అరుదు. కానీ హన్సిక మాత్రం దానికి భిన్నంగా వ్యవహరించింది. ఆ వివరాల్లోకి వెళితే..

సినిమా నటులంటే కేవలం గ్లామర్ షోలకే పరిమితమని, పబ్ లు, పార్టీలే వారి లోకమని అందరూ అనుకుంటారు. కానీ చాలా మంది నటీనటులు తమకు మంచి మనసుందని, పేదల కష్టాలకు కరిగే మనసుందని నిరూపించుకున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ హన్సిక కూడా తనకు అందమే కాదు అందమైన మనసు కూడా ఉందని నిరూపించుకున్నారు. రోడ్డు పక్కన పుట్ పాత్ లపై జీవించే అభాగ్యులకు దుప్పట్లు, ఆహారం అందించి అందరి ప్రశంసలను పొందారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరు హన్సిక ఎంతో గొప్ప పని చేసిందని మెచ్చుకుంటున్నారు.

తమ అభిమాన హీరోయిన్ ఇంత మంచి పని చేసిందని అందరికీ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒకసారి ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

English summary

Hansika helps road side footpath people in Chennai