'మమ్ముట్టి' కొడుకుతో 'హన్సిక' ప్రేమాయణం!!

Hansika in love with Mammootty's Son

06:34 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Hansika in love with Mammootty's Son

క్యూట్‌ హాట్ హీరోయిన్‌ హన్సిక మరోసారి లవ్‌లో పడింది. ఈ సారి మలయాళ స్టార్‌ ముమ్మట్టి తనయుడైన దుల్కర్‌ సల్మాన్‌తో! కానీ ఇది నిజజీవితంలో కాదు, రీల్‌ జీవితంలో. అవును ముమ్మట్టి తనయుడు దుల్కర్‌సల్మాన్‌ 'వాయైమూడి పేసువుమ్‌' అనే చిత్రంతో కోలీవుడ్‌ లో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో 'కాదల్‌కణ్మణి' అనే చిత్రంలో నటించాడు. అది కూడా సూపర్‌ హిట్‌ కావడంతో కోలీవుడ్‌లో తనకో ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. ఇప్పుడు హ్యాట్రిక్‌ విజయం పై కన్నేశాడు. తన మూడో చిత్రనికి హరిశంకర్‌, హరీష్‌నారాయణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో దుల్కర్‌తో హన్సిక రొమాన్స్‌ చేయనుంది. విజన్ ఐ మిడియా సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.


English summary

Hansika Romancing with Mammootty's son Dulquer Salmaan's new movie.