బాలీవుడ్‌లో 'హ్యాపీడేస్' రీమేక్

Happy Days movie remake in Bollywood

03:22 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Happy Days movie remake in Bollywood

టాలీవుడ్‌లో విభిన్నమైన కధాంశంతో బాగా సున్నితమైన భావోద్వేగాలను చాలా సహజంగా చిత్రీకరించే దర్శకుడు శేఖర్‌ కమ్ముల. 2007 లో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన హ్యాపీడేస్‌ సినిమా భారీ విజయం సాధించింది. మొదట్లో ఈ సినిమాని హిందీలో రీమేక్‌ చెయ్యాలని శేఖర్‌ కమ్ముల అనుకున్నాడు. కానీ వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ రీమేక్‌ మొదలుపెట్టలేదు. 'అనామిక' సినిమా తరువాత హ్యాపీడేస్‌ రీమేక్‌ చెయ్యాలని శేఖర్‌ కమ్ముల నిర్ణయించుకున్నాడు. ఈ హిందీ రీమేక్‌ వెర్షన్‌కి కథను కూడా సిద్ధం చేశాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేస్తున్నాడు.

ఈ సినిమా చిత్రీకరించడం కోసం పూణే లో ఉన్న ఒక ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ని ఎంపిక చేసుకున్నాడు. బాలీవుడ్‌ స్టార్స్‌ సల్మాన్‌ఖాన్‌, శేఖర్‌ కపూర్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటించనున్నారు. మార్చి నుంచి ఈ సినిమాను మొదలు పెట్టడానికి శేఖర్‌ కమ్ముల ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

English summary

2007 year super hit telugu movie 'Happy Days' was directed by Sekhar Kammula. After a long time this telugu version want to remake in Bollywood by same director Sekhar Kammula. This movie is producing by Bollywood star hero Salman Khan and Sekhar Kapoor.