'వంగవీటి' లో మురళీగా 'హ్యాపీ డేస్' వంశీ 

Happy Days Vamsi as Vangaveeti Murali

10:13 AM ON 26th March, 2016 By Mirchi Vilas

Happy Days Vamsi as Vangaveeti Murali

వర్మ స్టైలే వేరు... సంచలన చిత్రాల్లో పాత్రకు తగ్గ నటులను ఎంపిక చేయడం వర్మకే చెల్లింది.... వీరప్పన్ సినిమాలో కూడా అచ్చం వీరప్పన్ లానే ఉండేలా ఓ నటుణ్ణి ఎంపిక చేసుకున్న ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఇప్పుడు తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘వంగవీటి’లో కూడా అదే పంధా సాగిస్తున్నాడు. ఈ చిత్రంలో కీలకమైన దేవినేని మురళి పాత్రలో ‘హ్యాపీడేస్‌’ ఫేం వంశీ చాగంటి నటిస్తున్నారు. ఈ విషయాన్ని వర్మ స్వయంగా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడిస్తూ... ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో ఉన్నది వంశీ అని వర్మ చెప్పే వరకూ అతడిని గుర్తు పట్టడం కష్టంగా ఉంది. అంతగా తనను తాను మార్చుకున్నారు నటుడు వంశీ.

అభిమానులు సైతం ఈ ఫొటోకు అద్భుతం, ఆశ్చర్యంగా ఉంది అంటూ తెగ కామెంట్స్‌ పెట్టేస్తున్నారు. ఈ విషయమై వర్మ స్పందిస్తూ.. ఈ క్రెడిట్‌ అంతా పాత్ర కోసం తనని తాను మౌల్డ్ చేసుకున్న వంశీకే దక్కుతుందని తన ట్వీట్‌ లో పేర్కొన్నాడు.

English summary

Happy Days Vamsi as Vangaveeti Murali, Happy Days fame Chaganti Vamsi is acting as a Devineni Murali in Vangaveeti movie.