తెలుగు తమ్ముళ్ళకు సంక్రాంతి కళ

Happy news for TDP members

02:34 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Happy news for TDP members

మలివిడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు

పదేళ్ళు ప్రతిపక్షానికి పరిమితమై , ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, కష్టకాలంలో పార్టీని వెన్నంటిన తెలుగు తమ్ముళ్ళకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టడంలో ఆలస్యం జరుగుతూ వచ్చింది. అధికారం వచ్చినా, పార్టీని నమ్ముకున్న తమకు మాత్రం మోక్షం రాలేదని పలువురు కార్యకర్తలు నిర్వేదానికి గురవుతూ వస్తున్నారు. ఈ పరిస్తితులల్లో 2015 చివరిలో కొన్ని కార్పోరేషన్లకు పదవులు భర్తీ చేయడంతో కొత్త సంవత్సరంలో తమకూ పదవులు వస్తాయని చాలామంది ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి పండుగ నాటికి మలివిడత జాబితా విడుదలకు కసరత్తు చేస్తు న్నట్లు తెల్సి , కార్యకర్తల్లో ముఖ్యంగా ఆశావాహుల్లో సందడి మొదలైంది. ఈసారి నాలుగైదు కార్పొరేషన్‌లకు ఛైర్మన్లను ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తొలి విడతకు భిన్నంగా ఈసారి బీసీలకు చెందిన కార్పొరేషన్‌ పదవులను భర్తీ చెసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు ముఖ్యంగా రజక కార్పొరేషన్‌, నాయీ బ్రాహ్మణుల కార్పొరేషన్‌ లకు ఛైర్మన్‌లను ప్రకటించబోతున్నట్లు వినికిడి.

ఇదే క్రమంలో గతంలో ఎమ్మెల్యేగా చేసి తర్వాత వివిధ కారణాల వల్ల ఓడిపోయిన నాయకుల కోటాలో మాజీ మంత్రి, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు తదితరుల పేర్లను పరిశీలినలొకీ తీసుకుంటున్నారు. పార్టీ కర్నూలు జిల్లా శాఖ అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి పుష్పరాజ్‌, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు, సత్యనారాయణ రాజు(పాందువ్వ శ్రీను), పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మెంటే పద్మనాభం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చిక్కాల రామచంద్రరావు, గుంటూరు జిల్లా తెదేపాలో దీర్ఘకాలం పనిచేసిన మన్నవ సుబ్బారావు వంటి పేర్లను పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు.

ఇటీవలే పార్టీ సీనియర్ నేత డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు మరణించడంతో తూర్పు నుంచి చిక్కాలకు స్థానం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కడప జిల్లాలో వైసిపి ఎం ఎల్ ఎ ఆది నారాయణ రెడ్డిని పారీలోకి తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్న నేపధ్యంలో అదే జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నేత రామ సుబ్బారెడ్డి అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పుడు రామ సుబ్బారెడ్డికి పదవి ఇవ్వడం ద్వారా ఆది నారాయణ రెడ్డి చేరికకు మార్గం సుగమం చేయాలని ఆలోచన చేస్తున్నట్టు చెబుతున్నారు.

చంద్ర దండు కి పెద్దపీట ...

చంద్రబాబు ‘మీకోసం’ పాదయాత్రలో పాల్గొన్న ‘చంద్రదండు’ ప్రకాష్‌నాయుడు, పరుచూరి కృష్ణ తదితరులకు పదవి కట్టబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మహిళా నేతలు నన్నపనేని రాజకుమారి, శోభాహైమావతి, సత్యవాణి తదితరులకు కూడా అవకాశం కల్పించాలని భావిస్తున్నా ఎంతవరకు కార్యరూపం దాలుస్తోంది తెలియాలి.

కరణం ఖాయం ......

ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కరణం బలరామకృష్ణమూర్తి కి కీలకమైన ఏపీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌గా గిరీ కట్టబెడతారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈయన పేరు ఖరారైందని , ఇక లాంచనంగా సిఎమ్ ప్రకరించడమే తరువాయని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. సందడి చేయడానికి ఏర్పాట్లలో కూడా ఆయన అనుచరులు నిమగ్నమయ్యారని అంటున్నారు.

అన్ని పోస్టుల భర్తీకి చర్యలు .....

ఇక రాబోయే మూడు నెలల్లో మొత్తం అన్ని కార్పొరేషన్ల ఛైర్మన్‌ పదవుల భర్తీ చేసేయ్యలన్న సంకల్పంతో సిఎమ్ కసరత్తు చేస్తున్నారని కొందరు నేతలు అంటున్నారు. ఎవరెవరికి పదవులు ఇవ్వాలి, పార్టీ కోసం కనీసం పదేళ్లుగా కష్టపడుతున్నవారెవరు, నూతన సమీకరణాల నేపథ్యంలో ఇటీవల తెదేపాలో చేరిన నేతల్లో ఎవరికైనా ఇవ్వాలా తదితర అంశాల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తోపాటు కార్యక్రమాల కమిటీ కసరత్తు సాగిస్తోందని అంటున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నా ఎన్నికల్లో పోటీచేసే అవకాశం రాని నేతలకు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా బాగా కష్టపడినప్పటికీ 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన నేతలకూ అవకాశం కల్పిస్తారని కూడా అంటున్నారు.

మరి కింది స్థాయిలో మాటేమిటి ?

పైస్థాయిలో కార్పోరేషన్ పదవుల భర్తీకి చర్యలు చేపడుతున్నా , కింది స్థాయి కార్యకర్తల మాటే మిటనే వాదన బలంగా వినిపిస్తోంది. వివిధ ఎండోమెంట్ కమిటీలను భర్తీ చేయడంలో శ్రద్ధ వహించడం లేదని, ఫలితంగా జెండా మోసి మోసి భుజాలు కాయలు కాసాయే తప్ప , ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని పలువురు కార్యకర్తలు ఆవేదనకు గురిఅవుతున్నారు. మరి వీరి విషయంలో పార్తే ఎలా స్పందిస్తుందో చూడాలి.

English summary