హోదా వస్తేనే ... ఎన్టీఆర్ వారసులమవుతాం

Hari Krishna About Special Status To AP

10:05 AM ON 28th May, 2016 By Mirchi Vilas

Hari Krishna About Special Status To AP

ఈ మధ్య సైలెంట్ గా ఉంటున్న ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ ఎపికి ప్రత్యేక హోదా పై గళం విప్పారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సినీనటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 93వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన కుటుంబసభ్యులు, పలువురు టిడిపి నాయకులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. హరికృష్ణ, కళ్యాణ్ రామ్, తారకరత్న తదితరులు నివాలుర్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలుగువారు పోరాడినప్పుడే అన్న ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అని హరికృష్ణ వ్యాఖ్యానించారు. ఆనాడు హోదా ఇస్తామన్నవాళ్లు మోసం చేశారు.. ఈనాడు తెస్తామన్నవాళ్లు ఏం చేస్తున్నారో తెలియదన్నారు. హోదా కోసం ఇంటికొకరు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అప్పుడే ఎన్టీఆర్ కి వారసులమని అవుతామని, తెలుగు రాష్ర్టానికి బిడ్డలమవుతామని చెప్పుకొచ్చారు.

తెలుగుజాతి మనుగడ వున్నంతకాలం మరువలేని మహామనిషి స్వర్గీయ ఎన్టీఆర్ అని చెప్పారు. తెలుగుజాతి, భాష ఒకటుందని గుర్తుచేసింది ఎన్టీఆర్ అని, ఆత్మగౌరవం దెబ్బ తిన్నప్పుడు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. పేదవాడి గుండెల్లో ఆయన గుడికట్టుకున్నారాయన. ఎన్టీఆర్ జయంతి కంటే ముఖ్యమైన కార్యక్రమం తనకు ఏదీ లేదని హరికృష్ణ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:ఆడపిల్ల పుట్టిందని వేధింపులు(వీడియో)

ఇవి కూడా చదవండి:16 ఏళ్ళ కుర్రాడ్ని బట్టలూడదీసి తన్నారు

English summary

Telugu Desham Party Leader and Senior NTR Son and Junior NTR Father Nandamuri Hari Krishna made some sensational Comments on the issue over Special Status to Andhra Pradesh.