జనతా గ్యారేజ్ లో హరికృష్ణ షాకింగ్ రోల్!

HariKrishna in Janatha Garage

03:13 PM ON 4th April, 2016 By Mirchi Vilas

HariKrishna in Janatha Garage

టెంపర్, నాన్నకు ప్రేమతో వంటి వరుస హిట్లు తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. 'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తెరకెక్కించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే 30 రోజులు పాటు ముంబాయి లో షూటింగ్ జరుపుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన 'జనతా గ్యారేజ్' టీమ్ మళ్లీ గోవా లో షూటింగ్ కి సిధ్ధం అవుతున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ప్రస్తుతం ఇంటెర్నెట్ లో హల్చల్ చేస్తుంది.

అదేమిటంటే ఇందులో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ముఖ్య పాత్రలో నటిస్తున్నారని వార్తలు జోరుగా సాగుతున్నాయి. మాకొచ్చిన సమాచారం ప్రకారం హరికృష్ణ ఇందులో సీతయ్య వంటి పవర్ ఫూల్ పాత్రలో కాకుండా ఒక కామెడీ పాత్రలో నటించబోతున్నాడట. ఇందులో హరికృష్ణ చేసే కామెడీ సన్నివేశాలే ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయట. అయితే ఇందులో హరికృష్ణ నటిస్తున్నాడన్న విషయం ఈ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.

English summary

HariKrishna in Janatha Garage. Ntr father HariKrishna is playing comic role Janatha Garage movie.