అబ్బో కేసీఆర్ అంటే అర్ధం ఇదా..

Harish Rao praises KCR

12:27 PM ON 12th October, 2016 By Mirchi Vilas

Harish Rao praises KCR

పొగడడం మొదలెడితే దానికి హద్దు ఉండదు. ఇక రాజకీయ నేతలను పొగిడితే పదాలు కూడా సరిపోవు అలా ఉంటుంది. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై మంత్రి హరీష్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవం అనంతరం ఆయన కేసీఆర్ గురించి మాట్లాడారు. కేసీఆర్ అంటే కొత్త అర్ధం చెప్పారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదని KCRకు సరికొత్త మీనింగ్ చెప్పారు హరీష్. K అంటే KNOWLEDGE(జ్ఞానము), C అంటే COMMITMENT(నిబద్ధత), R అంటే RECONSTRUCTION(తెలంగాణ పునర్నిర్మాణం) అని ఆయన కొనియాడారు.

ఈ మూడింటిని నిజం చేసిన కేసీఆర్ కు శిరసు వంచి హరీష్ పాదాభివందనం చేశారు. సిద్ధిపేట జిల్లా కావడం ఎంతో సంతోషమని మంత్రి చెప్పారు. సిద్ధిపేట గురించి సీఎం చెబుతుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. కేసీఆర్ సిద్ధిపేట మాట్లాడుతుంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్లే ఉంటుందని హరీష్ చెప్పుకొచ్చారు.

English summary

Harish Rao praises KCR