టిఆర్ఎస్ లో  హరీష్ శకం ముగిసిందా?

Harish Rao To Say Good Bye To TRS

03:01 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Harish Rao To Say Good Bye To TRS

ఓ పక్క గ్రేటర్ లో వాడీ వేడిగా ప్రచారం సాగుతుంటే, టిఆర్ఎస్ లో కీలక వ్యక్తి జాడ కానరావడం లేదు. తెలంగాణా సిఎమ్ కెసిఆర్ కి స్వయానా మేనల్లుడైన మంత్రి హరీష్ రావు సంగతే ఇప్పుడు జోరుగా చర్చించుకుంటున్నారు. హరీష్ అంటే టిఆర్ఎస్ వాళ్లకు ఇప్పుడు నచ్చడం లేదని కొందరు అంటుంటే, ఇక ఆయన శకం పార్టీలో ముగిసినట్టే నని మరికొందరు అంటున్నారు. కొడుకు కెటిఆర్ కోసం హరీష్ ని దూరంగా పెట్టారని కొందరు అంటుంటే, ఇక ఇమడలేకపోతున్న హరీష్ పార్టీకి దూరమవుతారని మరికొందరి మాట. ఇక టిడిపి నేత, సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువు అయిన రేవంత్ రెడ్డి అయితే హరీష్ కాంగ్రెస్ గూటికి వెళ్లిపోతారని అన్నట్లు వార్తలు వచ్చేసాయి. అయినా హరీష్ నుంచి స్పందన లేకపోవడంతో నిప్పు లేందే పొగ రాదన్న సామెత గుర్తొచ్చేలా ఈ వ్యవహారం వుంది.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో హరీష్ రావు కీలక భూమిక వహించారు. సమైఖ్య వాదులకు కౌంటర్ ఇవ్వడంలో దిట్టగా నిలిచాడు. హైదరాబాద్ లో సమైక్య నినాదం వినిపిస్తే, విరుచుకు పడడం హరీష్ వంతయ్యేది. ఆఖరికి డిల్లీలోని ఎపి భవన్ లో అధికారులపై దాడికి తెగబడి, వార్తలకెక్కాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడు కూడా కెటిఆర్ , కవిత వున్నా సరే , అన్నీ తానై హరీష్ వ్యవహరిస్తూ , కెసిఆర్ తర్వాత అతనే అన్నట్టు వ్యవహారం నడిచింది. కట్ చేస్తే , టిఆర్ఎస్ అధికారంలోకి రావడం , కెసిఆర్ సిఎమ్ కావడం , హరీష్ తో పాటూ కెటిఆర్ మంత్రి అవ్వడం తెల్సిందే. అయితే అది వి ఐపి కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, హైదరాబాద్ ఎవరు వచ్చినా, వారితో భేటీ అయ్యేది కెటిఆర్ వంతు అన్నట్లు మారింది. కావాలనే హరీష్ ని దూరం పెడుతున్నారనే విమర్శలు వస్తూనే వున్నా , వాటిని ఖండిస్తూ వచ్చారు.

అయితే ఇప్పుడు అసలు గ్రేటర్ ఎన్నికల వేళ హరీష్ జాడ లేకపోవడం చర్చకు దారితీసింది. పైగా ఎన్నికల కాలం కావడం వలన సహజంగానే విపక్షాలు అధికార పక్షంలోని లొసుగులను తవ్వి తీస్తుంటాయి కదా. టిడిపి నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ప్రకారం హరీష్ అసంతృప్తి తో ఉన్నాడట. కాంగ్రెస్ లో రేపో మాపో చేరిపోతాదట. టిడిపిలో చేరుతుంటే చెప్పాలి గానీ, కాంగ్రెస్ లో చేరుతారంటూ రేవంత్ చెప్పడం ఏమిటబ్బా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బహుశా ఇటీవల ఓటు నోటు కేసులో ఇరుక్కున్న దగ్గర నుంచీ కాంగ్రెస్ వాళ్ళతో రేవత్ మరింత సఖ్యత కనబరుస్తున్నాడని అందుకే హరీష్ విషయం తెల్సి ఉంటుందని కొందరు చమత్కరిస్తున్నారు. అయినా కాంగ్రెస్ లో రేవంత్ బంధువు కీలక పాత్ర పోషిస్తున్నారు కదా అందుకే తెల్సి ఉంటుందని గుసగుసలాడు కుంటున్నారు.

ఏది ఏమైనా హరీష్ ని టిఆర్ఎస్ దూరం పెట్టిన విషయం వాస్తవం కావడంతో ఊహాగానాలకు బలం చేకూరుతోంది. ఒకప్పుడు ఫోర్స్ గా మాట్లాడిన హరీష్ ని గ్రేటర్ ప్రచారంలో దింపితే ప్రమాదమని గ్రహించి , టిఆర్ఎస్ వ్యూహాత్మకంగా హరీష్ ని పక్కన పెట్టినట్లు వినికిడి.

English summary

Telangana TRS Senior Leader Harish Rao to quit from congress.This was said by Telangana Telugu Desam Party(TDP)Leader.He says that harish rao will join in Congress Party