నిర్మాతగా మారిన 'హరీష్‌ శంకర్‌'

Harish Shankar bacomes producer

06:14 PM ON 5th December, 2015 By Mirchi Vilas

Harish Shankar bacomes producer

పది సంవత్సరాలు నుండి ఎదురు చూస్తున్న పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ కి గబ్బర్‌సింగ్‌ చిత్రంతో సూపర్‌హిట్‌ అందించిన దర్శకుడు హరీష్‌శంకర్‌. ఈ చిత్రమే పవర్‌స్టార్‌కి పాత క్రేజ్‌ తీసుకురాగా, హాట్ బ్యూటీ శృతిహాసన్ ని స్టార్‌ హీరోయిన్ చేసింది. హరీష్‌శంకర్‌ని కూడా టాప్ డైరెక్టర్ గా మార్చేసింది. ఆ తరువాత హరీష్‌ శంకర్‌ ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన 'రామయ్యా వస్తావయ్యా' ఫ్లాప్‌ కావడంతో కొంత విరామం తీసుకుని చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌తో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' తెరకెక్కించాడు. అది కామెడీ హిట్‌ కావడంతో ఈ సారి నిర్మాతగా హరీష్‌ మారనున్నాడు.

టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్లు రాజమౌళి, సుకుమార్‌, త్రివిక్రమ్‌, పూరీ జగన్నాధ్‌ నిర్మాతలుగా మారి సినిమాలు నిర్మిస్తుండగా తాజాగా ఈ జాబితాలోకి హరీష్‌శంకర్‌ కూడా చేరిపోయాడు. హరీష్‌ ఆప్త మిత్రులతో కలిసి ఒక చిత్రాన్ని నిర్మించనున్నాడు. అయితే ఈ చిత్రానికి హరీష్‌ ఏ తరహా కథ అందించనున్నాడో తెలియాల్సి ఉంది.

English summary

Harish Shankar bacomes producer. He is producing a new movie with his best friends.