చెవులు లేకుండా, పై చర్మం లేకుండా పుట్టిన వింత శిశువు(వీడియో)

Harlekin syndrom baby born in India

05:17 PM ON 13th June, 2016 By Mirchi Vilas

Harlekin syndrom baby born in India

భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి హర్లేకిన్ బేబీ జన్మించింది. మహారాష్ట్రలోని వాడి పట్టణానికి చెందిన ఓ మహిళ హర్లేకిన్ బేబీకి జన్మనిచ్చింది. చర్మంలోని పై పొర లేకుండా, చెవులు అసలే లేకుండా, కళ్లు, పెదవులు బయటకు కనిపించేలా బిడ్డ పుట్టడాన్ని హర్లేకిన్ బేబీ అంటారు. నాగ్ పూర్ లోని లతా మంగేష్కర్ హాస్పిటల్ లో ఈ శిశువు జన్మించింది. జన్యుపరమైన లోపాలతోనే ఇలా జరుగుతుందని డాక్టర్లు తెలిపారు. 1750 నుంచి ఇప్పటిదాకా భారతదేశంలో ఇలాంటి శిశువు జన్మించిన దాఖలాలు లేవని డాక్టర్లు చెప్పారు. పాపను NICUలో ఉంచి వైద్యం చేస్తున్నారు. ఇప్పటికి శిశువు పరిస్థితి కుదురుగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

English summary

Harlekin syndrom baby born in India