మహేష్‌ చిత్రానికి హారీష్‌ జయరాజ్‌ మ్యూజిక్‌..

Harris Jairaj composing music for Mahesh-Murugadoss film

04:32 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Harris Jairaj composing music for Mahesh-Murugadoss film

బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌.మురుగదాస్ తన ప్రతీ చిత్రానికి హారీష్‌ జయరాజ్‌నే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంచుకుంటాడు. తాజాగా మురుగదాస్-మహేష్‌బాబు కాంబినేషన్‌లో ఒక చిత్రం తెరకెక్కబోతుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి హారీష్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నట్లు సమాచారం, ఇది వరకు మహేష్‌ నటించిన సైనికుడు చిత్రానికి హారీష్‌ జయరాజ్‌ ఏ సంగీతాన్ని అందించారు. ఆ చిత్రం ఫ్లాప్‌ అయినా పాటలు మాత్రం సూపర్‌హిట్‌ అయ్యాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే హరీష్‌ జయరాజ్‌ మ్యూజిక్‌ అయితేనే బాగుంటుందని మహేష్‌ కూడా ఫిక్స్‌ అయ్యారు.

దీని బట్టి చూస్తుంటే ఈ చిత్రం భారీ సాంకేతిక విలువలతో, భారీ టెక్నిషియన్స్‌తో తెరకెక్కిస్తున్నట్లు అర్ధమవుతుంది. ఫేమస్‌ కెమెరామెన్‌ సంతోష్‌ శివన్‌ చేస్తున్న ఈ సినిమాకి హారీష్‌ జయరాజ్‌ కూడా వచ్చి చేరడంతో ఈ చిత్రం పై అంచనాలు పెరిగిపోయాయి. న్యాయవ్యవస్థపై హీరో చేసే పోరాటమే ఈ సినిమా. ఇందులో ఉన్న సోషల్‌ ఎలిమెంట్స్‌ నచ్చే మహేష్‌ ఈ చిత్రం చెయ్యడానికి అంగీకరించాడని తెలుస్తుంది. గతంలో సైనికుడు కూడా సోషల్‌ ఎలిమెంట్స్‌ బేస్‌ చేసుకునే వచ్చింది కాకపోతే అది ప్రేక్షకులకి కనెక్ట అవ్వలేదు.

English summary

Harris Jairaj composing music for Mahesh-Murugadoss film. Which going on to the sets after completion of Mahesh-Srinkanth Addala movie.