'సింగం-3' కి హారీష్ జయరాజ్‌ మ్యూజిక్‌..

Harris Jairaj composing music for Singam 3

08:24 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Harris Jairaj composing music for Singam 3

తమిళ స్టార్‌ హీరో సూర్య తాజాగా నటించిన సినిమా 'మేము'. డిసెంబర్‌ 4న విడుదల అవుతున్న ఈ చిత్రంలో సూర్య సరసన అమలాపాల్‌ నటిస్తుంది. ఇదిలా ఉండగా సూర్య నటిస్తూ నిర్మించిన తదుపరి చిత్రం '24'. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించగా సమంత సూర్య సరసన నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ చిత్రాన్ని సమ్మర్‌ కానుకగా మేలో విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉండగా సూర్య-అనుష్క జంటగా నటించిన సింగం సూపర్‌హిట్‌ అవ్వడంతో దానికి కొనసాగింపుగా సింగం-2 సీక్వెల్‌ తీశారు. ఇది కూడా సూపర్‌హిట్‌ అవ్వడంతో దీనికి కూడా మరో సీక్వెల్‌గా సింగం-3 తీసే పనిలో ఉన్నారు.

అయితే ఈ రెండు చిత్రాలకి దేవీశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ అందించాడు. ఇప్పుడు సింగం-3కి దేవిశ్రీని తప్పించి అనిరుధ్‌ రవిచంద్రన్‌ తీసుకోవాలని అనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు అనిరుధ్‌ని కూడా తప్పించి హారీష్ జయరాజ్‌ని ఎంపిక చేశారు. సూర్యకి హరీష్‌ కొత్తేం కాదు. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో చాలా సినిమాలు వచ్చాయి. అవన్నీ మ్యూజికల్‌ హిట్సే. ఇప్పుడు మళ్ళీ సింగం-3కి పనిచేయబోతున్నారు. డిసెంబర్‌ 2 నుంచి ఈ సినిమా షూటింగ్‌ మొదలు కాబోతోంది. అది కూడా ఈ సినిమాలో ప్రధాన షెడ్యూల్‌ని వైజాగ్‌లో చిత్రీకరించబోతున్నారు.

దాదాపు నెల రోజుల పాటు వైజాగ్‌లో షూటింగ్‌ జరిపిన తరువాత తమిళనాడులోని టుటికోరిన్ పోర్ట్‌లో తరువాత షెడ్యూల్‌ని చేస్తారు. సింగం రెండు భాగాల్లోని హీరోయిన్‌గా నటించిన అనుష్క ఇందులోనూ కొనసాగుతున్నారు. అలాగే మరో హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటిస్తోంది.

English summary

Harris Jairaj composing music for Singam 3 which was directing by Hari.