ఈ అమ్మడిని ఆంటీ అంటే ఏమైందో తెలుసా?

Harshali Malhotra calls Katrina Kaif aunty

12:31 PM ON 20th July, 2016 By Mirchi Vilas

Harshali Malhotra calls Katrina Kaif aunty

మామూలుగానే ఆడాళ్ళ వయస్సు చెప్పారని అంటారు... అందునా తారల వయస్సు విషయం చెప్పక్కర్లేదు... ఇదంతా ఎందుకంటే, మూడు రోజుల క్రితం బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పుట్టిన రోజు జరుపుకున్న సందర్బంగా చోటు చేసుకున్న ఈ ఉదంతం చూస్తే, అసలు ఏమిటి వింత పోకడ అన్నట్లు ఉంటుంది. అసలు విషయంలోకి వెళ్తే.. జూలై 16తో కత్రినాకు 33 ఏళ్లు నిండిపోయాయి. ఈ సందర్భంగా ఓ చిన్నారి బర్త్ డే విషెస్ చెబుతూ ఆంటీ అని పిలిచిందట.. పోనీ ఆ పాప ఎవరో కూడా కాదు, 'భజరంగీ భాయిజాన్' మూవీలో సల్మాన్ తో పాటు కనిపించిన చిన్నారి హర్షాలి మల్హోత్రా.

సినిమాలో మున్నీ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం సంగతేమో కానీ.. 'హ్యాపీ బర్త్ డే కత్రినా కైఫ్ ఆంటీ' అంటూ ఆ 8 ఏళ్ళ పసిపిల్ల ట్వీట్ చేయడం పెద్ద నేరంగా మారిపోయింది. కత్రినా కైఫ్ మాత్రం ఈ ఇన్సిడెంట్ పై పాజిటివ్ గానే స్పందించి థాంక్యూ లవ్ అంటూ కామెంట్ పెట్టింది. అయితే ఆమె అభిమానులకు ఈ పిలుపు ఏమాత్రం నచ్చలేదట. అందుకే కత్రినాని అక్కా అనకుండా ఆంటీ అంటుందా అంటూ తిట్టిపోసేశారు. మరికొందరైతే ఆమె నోరు పడిపోవాలని కూడా శాపాలు పెట్టేశారు. ఇక్కడ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ల రియాక్షన్ నే గురించే మాట్లాడుకోవాలి.

33 ఏళ్ల యువతిని అంత చిన్నారి ఆంటీ పిలిస్తే తప్పేంటో అర్ధం కాని విషయం. తమ అభిమాన నటి అయినంత మాత్రాన, కేవలం ఆంటీ అని పిలిచినందుకే దారుణంగా శాపాలు పెట్టడం అవసరమా? అభిమానంతో మరీ ఇంత దారుణంగా ప్రవర్తించడం విజ్ఞత కాదు అంటూ పలువురు నెటిజన్ల నుంచి కామెంట్స్ పడుతున్నాయి.

English summary

Harshali Malhotra calls Katrina Kaif aunty