భయపెట్టే చారిత్రాత్మక కట్టడాలు

Haunted historical places in India

03:46 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Haunted historical places in India

భారతదేశం గొప్ప పురాతన కట్టడాలతో ఎంతో చారిత్రాత్మక విలువలు కలిగి ఉంది. ఇక్కడ ఎన్నో భవనాల వెనక నెత్తుటి చరిత్ర ఉంది. అంతే కాకుండా అనేక రహస్యాలు దాగి ఉండే భారతదేశ చరిత్రను మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎంటర్‌ యువర్‌ ఓన్‌ రిస్క్‌. అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో మిమల్ని వెంటాడుతాయి.

1/7 Pages

సావోయ్‌ హోటల్‌, ముసోరీ

ఇది ఒక మిస్టీరియస్‌ ప్లేస్‌. ఈ  చారిత్రాత్మక హోటల్‌ ను బ్రిటిష్‌ రాజ్‌ 1902 లో నిర్మించారు. మిస్‌ ప్రాన్సిస్‌ గార్నెట్‌-ఆర్మే మరియు మిస్‌ ఎవా మౌస్ట్‌ స్టీఫెన్‌ 1911లో ఈ హోటల్‌ లో ఉండడానికి వచ్చారు. అనుకోకుండా ఒకరోజు ఉదయం మిస్‌ ఫ్రాన్సిస్‌ అంతుచిక్కని విధంగా చనిపోయింది. ఆమె చావు మిస్టరీగా మారింది. ఆమె తాగే పానీయంలో విషం కలవడం వల్ల ఆమె చనిపోయింది. కాని ఆ విషాన్ని ఎవరు కలిపారో తెలియలేదు. అధికారులు మాత్రం మిస్‌ ఎవా ని అరెస్టు చెయ్యడానికి ప్రయత్నించారు కాని ఎవా ఏ నేరం చేయలేదని కోర్టు నిర్ధారించింది. కానీ మిస్‌ ఫ్రాన్సిస్‌ దెయ్యం అయ్యి తిరుగుతున్నారట. ఆమెకి విషం ఇచ్చి చంపిన వారు ఎవరో తెలుసుకోవడం  కోసం దెయ్యంగా మారి ఆ హోటల్‌ చుట్టూ తిరుగుతున్నారని  అక్కడి వారు అంటున్నారు.

English summary

This is a top 6 list of locations that are reportedly haunted by ghosts or other supernatural beings including demons.