దెయ్యాలున్నాయని కన్ఫర్మ్ అవ్వాలంటే ఈ ఓడల గురించి తెలుసుకోవాల్సిందే

Haunted Ships That Confirms There Was Devils

11:46 AM ON 17th September, 2016 By Mirchi Vilas

Haunted Ships That Confirms There Was Devils

అవును దెయ్యాలు ఉన్నాయా లేదా అనే దానిపై, అందరిలో సందేహం... కొందరు ఉన్నాయని అంటారు, కొందరు లేదని అంటారు. ఉన్నాయని చెప్పేవాళ్ళు, దెయ్యాలు పాడు పడిన ఇళ్ళల్లోనో, పెద్ద పెద్ద చెట్లమీదనో ఉంటాయని అంటారు. చిన్నతనం నుంచీ దెయ్యల స్థావరాలు ఇవే అన్న నమ్మకం చాలామందిలో బలపడిపోయింది. కానీ అవి పెద్ద పెద్ద ఓడల్లో కూడా ఉంటాయంటే నమ్ముతారా? నమ్మశక్యంగా లేకపోయినా, ఇది నమ్మలేని పచ్చినిజం. కావాలంటే ఈ వివరాలు చూడండి మీకే తెలుస్తుంది.

1/11 Pages

ది కల్యూచ్....

ఈ నౌక ప్రతి రోజూ చిలొయి దీవుల్లో దర్శనమిచ్చేది. అయితే ఆ ఓడలో మనుషులున్న జాడలు కనిపించేవి కావు. కానీ లైట్లు మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోయేవి. ఆ ఓడను చూసేవారికి అక్కడ ఎవరో పార్టీ చేసుకుంటున్నట్టు అనిపించేది. మనుషుల నవ్వులు బిగ్గరగా వినిపించేవి. ఒకరిద్దరు ధైర్యం చేసి దగ్గరకు వెళ్ళి చూశారు.కానీ అక్కడ వారికెవరూ కనిపించలేదు. అయితే అక్కడ మనుషులు పార్టీ చేసుకున్న దాఖలాలు మాత్రం కనిపించాయట! ఈ ఓడకు సంబంధించిన వివరాలు ఎవరికీ తెలియదు. దీనికి సంబంధించిన రకరకాల కథలు మాత్రం వాడుకలో ఉన్నాయి. ఉన్నట్టుండి ఈ ఓడ నీటి అడుగుభాగంలోకి వెళ్ళిపోయేదట. ఈ ఓడ మూడు మత్స్య కన్యల ఆధీనంలో ఉండేదనీ, అవే ఈ ఓడలో పార్టీ చేసుకునేవని కూడా ఓ ప్రచారం వుంది. కానీ ఓడలో మత్స్య కన్యలను చూసిన వారెవరూ లేరు. దాంతో ఈ ఓడలో దెయ్యాలు తిరుగుతాయన్న నమ్మకం చాలా మందిలో బలంగా నాటుకుపోయింది.

English summary

In these modern days everything became scientific. Coming to the Devils existence confirmation some people will say that devils do not exist and some people strongly say that they exist in the world. Here are some examples and haunted ships that proves there were devils.