దీపారాధన సమయంలో పొరపాటుగా దీపం కొండెక్కితే ఏం చెయ్యాలి?

Have to know Deeparadhana mistakes

01:00 PM ON 15th October, 2016 By Mirchi Vilas

Have to know Deeparadhana mistakes

ప్రతి ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేసే అలవాటు, సంప్రదాయం ఉంటుంది. కొంతమందికి వీలు కానప్పుడు సాయంత్రం పూట మాత్రమే దీపారాధన చేస్తూ ఉంటారు. కొందరు పౌర్ణమి, ఇతర ముఖ్యమైన రోజుల్లో ఆలయాలకు వెళ్లి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇలా దీపం వెలిగించే సంప్రదాయం అనాదిగా వస్తూ ఉంది. అయితే దీపానికి ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఎక్కువగా ఉపయోగిస్తారు. దీపంలో రెండు వత్తులు వేసి వెలిగించే సంప్రదాయం గురించి కూడా అందరికీ తెలిసిందే. అయితే మీరు చేస్తున్న దీపారాధన ప్రక్రియ సరిగానే ఉందా? మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా? కాదా అన్న విషయం తెలుసుకోవడం మంచిది.

నిత్యం చేసేదే అయినా.. దీపారాధనలో కొంతమంది తెలిసీ, తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న పొరపాట్లను తెలుసుకుని.. మరోసారి చేయకుండా ఉండటం మంచిది. సాధారణంగా దీపారాధనలో చేసే పొరపాట్లేంటో ఇప్పుడు చూద్దాం..

1/10 Pages

1. దీపారాధనకు వేరుశనగ నూనె అస్సలు ఉపయోగించరాదు. దీపారాధనకు ఆవు నెయ్యి ఉపయోగిస్తే లక్ష్మీ కటాక్షం, ఆముదం ఉపయోగిస్తే కష్టాలు దూరమవడం, నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే దుష్టశక్తులు, శత్రుబాధలు తొలగిపోతాయి.

English summary

Have to know Deeparadhana mistakes