హెచ్‌డీ క్వాలిటీ ఫొటోల కోసం ఓ యాప్

HD camera Ultimate For Android App

04:06 PM ON 21st December, 2015 By Mirchi Vilas

HD camera Ultimate For Android App

తమ ఫోన్లలో హైక్వాలిటీతో ఫొటోలు తీసుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఫోన్ కెమెరా అందుకు సహకరించదు. దీంతో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అనేక రకాల కెమెరా యాప్స్ అందుబాటులో వచ్చాయి. తాజాగా ఐజాయ్‌సాఫ్ట్ సంస్థ హెచ్ డీ క్వాలిటీతో ఫొటోలు తీసేందుకు హెచ్‌డీ కెమెరా అల్టిమేట్ ఫర్ ఆండ్రాయిడ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని సాయంతో స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇప్పుడు అత్యంత నాణ్యమైన క్వాలిటీతో ఫొటోలు, వీడియోలను తీసుకునేందుకు వీలుంది. సైలెంట్ షటర్, స్పాట్ ఫోకస్, క్విక్ స్నాప్, షేక్ రెడ్యూసింగ్, కౌంట్‌డౌన్ టైమర్, కంటిన్యూస్ షూటింగ్ వంటి వివిధ రకాల ఫీచర్లు ఈ యాప్‌లో లభిస్తున్నాయి. దీంతోపాటు మనం తీసుకున్న ఫొటోలు, వీడియోలకు అనేక రకాల ఎఫెక్ట్‌లను కల్పించుకోవచ్చు. యాక్షన్, నైట్, సన్‌సెట్, ప్లే, పనోరమా మోడ్‌లలో దృశ్యాలను బంధించవచ్చు. 3.3 ఎంబీ సైజ్‌లో ఉన్న ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ కలిగిన యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

English summary

HD Camera Ultimate allow you to shoot excellent photo in a fast and simply way. It has utilized all advantage of your phone or tablet. HD Camera,Quick Snap,Gorgeous Camera Effects, easy take HD Quality photo.