వైఫ్ కి టెక్కీ పెట్టిన టార్చర్ చూస్తే షాకవ్వాల్సిందే

He harrsaed his wife with Cockroaches

11:31 AM ON 19th January, 2017 By Mirchi Vilas

He harrsaed his wife with Cockroaches

చదువుకున్నా చదువుకోకపోయినా సరే కొంతమంది మగాళ్లు శాడిష్టుల్లా మారిపోతున్నారు. భార్యను రకరకాలుగా వేధించే వాళ్ళు పెరిగిపోతున్నారు. ఈ టార్చర్ భరించలేక కొంతమంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజగా ఓ ప్రబుద్ధుడు తన భార్యని బొద్దింకలతో టార్చర్ పెట్టిన భాగోతం వెలుగుచూసింది. ఆ భర్త ఆరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే,.

సుజాత- అవినాష్ దంపతులు బెంగుళూరులో వుంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. హ్యాపీగా సాగుతున్న వీళ్ల కాపురంలో కలతలు మొదలయ్యాయి. మరి ఏమైందో తెలీదుగానీ, వేరే మహిళలతో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని సుజాత వాదన గా వుంది. అందుకే, ఆనాటి నుంచి భర్తకు దూరంగా వుండడం మొదలుపెట్టింది.. అంతేకాదు ఒకానొక దశలో విడాకులు కూడా ఇవ్వాలని కోరింది ఆమె. అప్పటినుంచి తన ఆఫీస్ నుంచి బొద్దింకలను బాక్స్ లో తీసుకొచ్చి ఆమె బెడ్ , దుస్తులపైనా వదులుతున్నాడని చెబుతూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బొద్దింకలతో వైఫ్ ని టార్చర్ పెట్టిన మాట వాస్తమేనని, విడాకులు మాత్రం ఇచ్చేది లేదని అవినాష్ పోలీసుల కౌన్సెలింగ్ లో చెప్పాడు.

ఇది కూడా చూడండి : పేరులోని మొదటి అక్షరం తో మీరెలాంటివారో తెలుసుకోవచ్చిలా

ఇది కూడా చూడండి : బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ఇప్పటివరకు ఎన్ని నిజమయ్యాయో మీరే చూడండి

ఇది కూడా చూడండి : ఈ ఈ రాసుల వాళ్ళు వివాహం చేసుకోకూడదట

English summary

A woman and her husband were working in software company in bangalore. Recently they want to separate with some issues this man started harassing his wife with cock roaches.