ఇతడు ధర్మరాజు కాదు ... అయినా భార్యను ఫణంగా పెట్టేసాడు!

He is not Dharmaraju...But kept his wife in beating

11:05 AM ON 27th December, 2016 By Mirchi Vilas

He is not Dharmaraju...But kept his wife in beating

మహాభారతంలో ధర్మరాజు సంగతి తెల్సిందే కదా. జూదం అనే వ్యసనం ఉండడం వలన ద్రౌపదిని ఫణంగాపెట్టి జూదమాడిన విషయం తెల్సిందే. దానివలన కలిగిన నష్టం కూడా మనకు తెలిసిందే. కానీ యుగాలు మారినా తీరు మారలేదు అన్నట్లు, అదే తరహాలో రవీందర్ సింగ్ అనే ప్రబుద్ధుడు భార్యను జూదంలో ఫణంగా పెట్టాడు. అయితే ఇతగాడు ఆడింది పాచికలు కాదు ... లేటేస్ట్ అయిన క్రికెట్ బెట్టింగ్ ఆడాడు. ఫలితం మాత్రం సేమ్ టు సేమ్. వివరాల్లోకి వెళ్తే,

ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా గోవింద్ నగర్ ప్రాంతానికి చెందిన రవీందర్ సింగ్ కు ఐదేళ్ళ క్రితం పెళ్లయింది.మొదట్లో కొన్నాళ్ళు బుద్ధిగా కాపురం చేసాడు. తర్వాత వేధింపులు మొదలు పెట్టాడు. పుట్టింటినుంచి నగలు, డబ్బు తీసేసుకు రమ్మని . ఇతగాడికి ఐపీఎల్ బెట్టింగుల పిచ్చి కూడా ఉంది. షేర్ మార్కెట్ లో తన ఆస్తినంతా పోగొట్టుకున్న రవీందర్ . ఐపీఎల్ బెట్టింగుల్లో గెలిచి ఆ నష్టాన్ని భర్తీ చేసుకుందామనుకున్నాడు.

ఆ బెట్టింగుల్లోకూడా అతగాడు వరుసగా ఓడిపోతూ వచ్చాడు. దీంతో తన భార్య జస్మీత్ కౌర్ ను పణంగా పెట్టాడు. అంతే ఓడిపోవడంతో గెలిచిన పందెంరాయుళ్ళు ఆమెను తమతో రావలసిందిగా ఒత్తిడి చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. మొత్తానికి జస్మిత్ కొంతమంది సామాజిక కార్యకర్తల సాయంతో ఈ విషయాన్ని పోలీసులకు చేరవేసింది. అంతేకాదు పుట్టింటి నుంచి 7 లక్షలు తీసుకురావాలని తన భర్త తనను వేధిస్తున్నాడని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న రవీందర్ సింగ్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో, సోషల్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. అయినా వ్యసనపరులకు మార్పు వస్తుందా అంటే మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఇవి కూడా చదవండి: భజనలో గాయకుల గానామృతానికి నోట్లవర్షం

ఇవి కూడా చదవండి: అవును మండపానికి పెళ్లికూతురు ఇలా వచ్చింది

ఇవి కూడా చదవండి:క్రికెటర్ భార్య స్లీవ్ లెస్ వేసుకున్న ఫోటో ... నెటిజన్ల మండిపాటు

English summary

A man from Uttar Pradesh kept her wife in cricket beating.