ఈ అమీర్‌ ఆ అమీర్‌ కాదు...

He Is Not That Amir

02:11 PM ON 26th November, 2015 By Mirchi Vilas

He Is Not  That Amir

మత సహనం వ్యాఖ్యలతో అమీర్‌ఖాన్‌ పేరు దేశమంతా మారుమోగిపోతోంది. ఒక వర్గం అమీర్‌ఖాన్‌కు మద్ధతు ఇస్తోంటే.. మరో వర్గం అమీర్‌ఖాన్‌ను దుమ్మెత్తిపోస్తోంది. అమీర్‌ఖాన్‌ దేశం వదిలిపోతే మంచిదేనంటూ చురకలు వేసేవారి సంఖ్య, అమీర్‌ఖాన్‌ను సినిమాలు చూడమంటూ, అమీర్‌ఖాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ఉత్పత్తులు కొనమంటూ ఇలా ఎన్నో రకాలు వ్యతిరేకతలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయాలతో ఏమాత్రం సంబంధం లేని, అసలు దేశానికి ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్న మరో అమీర్‌కు ఈ సెగ తాకింది.

శాన్‌ప్రాన్సిస్కోకు చెందిన ఒక రిపోర్టర్‌ అయిన అమిర్‌ ఇఫ్రాతి అనే వ్యక్తి తన ట్విట్టర్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయగానే కొన్ని వందల కొలదీ ట్వీట్లు అమీర్‌ఖాన్‌ను తిడుతూ వచ్చాయట. దేశం వదిలిపోమ్మంటూ, నువ్వు నరకానికి పో అదే నీకు సరైన స్థానం అంటూ విద్వేషపూరితమైన ట్వీట్లను చూసి మొదట అమీర్‌ఖాన్‌ కాని అమిర్‌ చాలా కంగారు పడ్డాడట. కానీ అసలు విషయం తెలుసుకున్న అమిర్‌ కడుపు చెక్కలయ్యేలా నవ్వుకున్నాడట.

దేశంలో ట్విట్టర్‌ అనే సామాజికి మాధ్యమం ఎంతగా జనంలోకి చొచ్చుకుని పోయిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణగా కూడా చెప్పొచ్చు. వివాదానికి కారణమైంది ఒకరైతే , ఆ వివాదానికి సంబంధం ఏమాత్రం లేకపోయిన ఒక్క పేరులో తప్పు కారణంగా విద్వేషపూరితమైన ట్వీట్లను అందుకోవాల్సి వచ్చింది సదరు అమిర్‌.

English summary

Mistaken identity that is equal parts hilarious and tragic, Amir Efrati, a reporter based in San Francisco, woke on Tuesday up to find his Twitter feed inundated with messages meant for the Bollywood actor.