ఏపీలో ఏమో టీచర్.. తమిళనాడులో బైక్ లు దొంగ!

He is teacher in Andhra Pradesh and thief in Tamil Nadu

04:54 PM ON 21st September, 2016 By Mirchi Vilas

He is teacher in Andhra Pradesh and thief in Tamil Nadu

ఏ సినీనటుడు పోషించని ద్విపాత్రాభినయం ఇది. ఎందుకంటే, విద్య నేర్పే గురువుగా ఉంటూ, మరోపక్క బడా బైక్ దొంగగా ఉండడం చూడలేదు. ఇక నిజజీవితంలో ఇలా చాలా కష్టం కూడా. కానీ ఓ టీచర్ ఇది సుసాధ్యం చేసాడు. వివిధ ప్రాంతాలలో 223 మోటార్ బైక్ ల చోరీకి సంబంధంచి కళాశాల అధ్యాపకుడిని పోలీసులు అరెస్టు చేయడం ఇందుకు నిదర్శనం. పోలీసుల కథనం ప్రకారం... వేలూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన టీచర్ ప్రభు(45) గత 9వ తేదీ రాత్రి ఇంటి ముందు బైక్ ను పార్క్ చేసాడు. మరుసటి రోజు ఉదయం ఆ వాహనం కనిపించకపోవడంతో ఆర్కాడు టౌన్ పోలీసులకు పిర్యాదు చేశారు.

దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరిపి వేలూరుకు చెందిన ఇమ్రాన్ బాషా(26)ను సోమవారం సాయంత్రం అరెస్టు చేసి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన ఇమ్రాన్ బాషా ఆంధ్రరాష్ట్రం చిత్తూరులో వున్న ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడని, ఖాళీ సమయంలో మోటార్ బైకులను చోరీ చేసి చిత్తూరులో విక్రయిస్తున్నాడట. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాలలో 223 మోటార్ బైక్ లను చోరీచేసి విక్రయించినట్లు విచారణలో తేలిందని అంటున్నారు.

English summary

He is teacher in Andhra Pradesh and thief in Tamil Nadu