'కబాలి'లో విలన్‌ అతనా!!

He is the villan for Kabali

11:41 AM ON 29th December, 2015 By Mirchi Vilas

He is the villan for Kabali

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కబాలి'. రంజిత్‌ కుమార్‌ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌ సరసన రాధిక ఆప్టే హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ చిత్రంలో రజనీకాంత్‌ కి విలన్‌ గా నటిస్తుంది ఎవరు? అని ఇన్ని రోజులు ఎన్నో ప్రశ్నలు వెలువడ్డాయి. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికేసినట్టే. హాంకాంగ్‌ స్టార్‌ హీరో జెట్లీ విలన్‌గా నటించబోతున్నాడని తాజా సమాచారం. తొలుత హాలీవుడ్‌ స్టార్స్‌ని పరిశీలించిన తరువాత ఈ పాత్రకి జెట్లీ నే రజనీకాంత్‌ కి సరైన విలన్‌ అని కబాలి చిత్ర టీమ్‌ భావించారట. రజనీకి జెట్లీకి మధ్యవచ్చే యాక్షన్‌ సన్నివేశాలని మలేసియా, హాంకాంగ్‌ లలో చిత్రీకరిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 1న విడదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary

Jet Lee is the villan in RajniKanth's Kabali movie. Radhika Apte is pairing with RajniKanth in Kabali movie.