యోగ ముద్రలు

Healing hand yoga Mudras

07:24 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Healing hand yoga Mudras

ముద్రలను ఎప్పుడైనా, ఎక్కడైనా చేయటం సులభమే. అయితే కమలాసనంలో కూర్చొని దృష్టి సారిస్తే నయం చేయటంలో ముద్రలు సహాయపడతాయి. ముద్రలను కొన్ని రోగాల నయం కొరకు ఉపయోగిస్తున్నప్పటికి, ముద్రలను ప్రతి రోజు అభ్యాసం చేస్తే మంచి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

చేతుల భాగాలపై ఉన్న నాడి సెంటర్లను ఉపయోగించి ముద్రలను నిరంతరం అభ్యాసం చేస్తే మన శరీరంలో మార్పులు నిమిషంలోనే వస్తాయి. అంతేకాక శరీరం లోపల బాగాల్లో కూడా నయం చేసే ప్రక్రియలను ప్రేరేపిస్తాయి. ముద్రలను రెండు చేతులతో చేయవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ సమయంలో వేళ్ళు  సౌకర్యవంతముగా ఉండాలి. అంతేకాని దృడంగా లేదా గట్టిగా ఉండకూడదు.

ముద్రా విజ్ఞాన్ శాస్త్రాన్ని లోతుగా పరిశీలిస్తే రహస్యంగాను మరియు అద్భుతముగాను ఉంటుంది. మనస్సు యొక్క అంతర్లీన అంశాలను క్రమపరిచేందుకు కష్టం కాదు. అలాగే  సైన్స్ ద్వారా మనస్సు ఏకాగ్రత సాధించడం కూడా కష్టం కాదు. ముద్రా విజ్ఞాన్ అనేది అత్యున్నత స్వీయ ధ్యానం యొక్క అతి ముఖ్యమైన అంశం అని చెప్పవచ్చు. ఇక్కడ యోగ ముద్రలు అనారోగ్యంను నయం చేయటంలో ఎలా ప్రభావితం చేస్తాయో అద్భుతంగా చూపిస్తారు. ముద్రలు అనేవి సాదారణ చెవి పోటు నుంచి గుండె వ్యాధుల వరకు ఎటువంటి వ్యాధులను అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా నయం చేస్తాయి.

శూన్య ముద్ర ద్వారా చెవి పోటును కేవలం కొన్ని నిమిషాల్లోనే నయం చేయవచ్చు. అలాగే అనేక ముత్రాశయ  ఇన్ ఫెక్షన్ లను అపాన్ ముద్ర ద్వారా నయం చేయవచ్చు. అంతేకాక తీవ్రమైన గుండెపోటు సమయంలో కూడా మ్రిత సంజీవిని ముద్ర ద్వారా కొన్ని సెకన్లలోనే ఉపశమనం కలిగించవచ్చు.

1/14 Pages

హస్త ముద్ర

మన శరీరం భూమి, నీరు, గాలి, అగ్ని మరియు ఆకాశం అనే ఐదు అంశాలతో రూపొందింది. ఈ ఐదు అంశాలు కూడా మన విశ్వములో ఏర్పాటు ఉంది. ఈ ఐదు అంశాలను మన శరీరంలో విధులను నిర్వర్తించటానికి మరియు ఆరోగ్యంగా ఉంచటానికి కేటాయించారు.

తీవ్రమైన ఒక పరిశోదన తర్వాత భారతీయ ఋషులు హస్త ముద్రలు చాలా ముఖ్యం అని కనుగొన్నారు. ఐదు మూలకాల్లో శక్తి ప్రవాహాన్ని సంతులనం చేస్తాయి. ఐదు వేళ్లు శరీరం యొక్క ఐదు అంశాలను నియంత్రిస్తాయి.

1. బొటన వేలు - అగ్ని మూలకం
2. చూపుడు వేలు - గాలి మూలకం
3. మధ్య వేలు - ఆకాశం మూలకం
4. ఉంగరం వేలు - భూమి మూలకం
5. చిన్న వేలు - నీరు మూలకం

కాబట్టి  హస్త ముద్ర అనేది మంచి ఆరోగ్య నిర్వహణ మరియు వ్యాధుల ఉపశమనంలో సహాయపడుతుంది. వేలి చివరలు బొటన వేలిని నొక్కటం ద్వారా శరీరంలో సంబంధిత విషయాలలో సమతుల్యం ఉండేలా చేస్తుంది. దీనిని ప్రతి  రోజు చేస్తే మంచి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు.  అద్భుతమైన నయం చేసే శక్తి ఉంది. అందువలన హస్త ముద్రలను సరిగ్గా సాధన చేస్తే అన్ని ప్రధాన వ్యాధులను నయం చేయవచ్చు.  అంతేకాక ఆనందం మరియు ఆధ్యాత్మిక భావనలను కూడా అందిస్తుంది.

English summary

Mudras are easy to perform at anytime, although sitting in the lotus position and focusing on the healing can be an advantage.