బాదం వలన కలిగే ప్రయోజనాలు 

Health benefits of Almonds

06:30 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Health benefits of Almonds

బాదం అనేది చాలా ప్రజాదరణ పొందిన చెట్టు యొక్క గింజ అని చెప్పవచ్చు. దీనిలో అధిక క్రొవ్వు ఉన్నప్పటికీ, చాలా పుష్టికరమైన మరియు చాలా ఆరోగ్యకరమైన ఆహారం. ఇప్పుడు బాదంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను వివరంగా తెల్సుకుందాం.

1/10 Pages

1. బాదంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి

బాదం మధ్య ప్రాచ్యంలో ఎక్కువగా లభ్యం అయ్యేది. కానీ ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్ లో ఉత్పత్తి అవుతుంది. బాదం గింజ షెల్ లోపల ఉంటుంది. దానిని బయటకు తీసి మార్కెట్ లో అమ్ముతారు. అలాగే మార్కెట్ లో బాదంను పచ్చిగాను లేదా వేగించిన రూపంలో అమ్ముతారు.

బాదంలో చాలా ఆకట్టుకొనే పోషకాలు ఉన్నాయి. ఇప్పుడు 1 ఔన్స్ (28 గ్రాములు) బాదంలో ఉన్న పోషకాలను తెలుసుకుందాం.

ఫైబర్: 3.5 గ్రాములు
ప్రోటీన్: 6 గ్రాములు
కొవ్వు : 14 గ్రాములు ( 9 గ్రాముల అసంతృప్త కొవ్వులు ఉంటాయి)
విటమిన్ ఇ: 37% RDA
మాంగనీస్: 32% RDA
మెగ్నీషియం: 20% RDA
రాగి, విటమిన్ B2 (రిబోఫ్లావిన్) మరియు ఫాస్పరస్ తగిన మొత్తంలో ఉంటాయి.

అలాగే  161 కేలరీలు మరియు జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు 2.5 గ్రాములు ఉంటాయి. బాదంలో ఉండే కేలరీలలో 10-15% శరీరం శోషించదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కొవ్వును విచ్ఛిన్నం మరియు వ్యాప్తి చేయటం చాలా కష్టం.

బాదంలో ఫిటిక్ ఆమ్లం ఎక్కువగా ఉండుట వలన ఖనిజాలను నిరోదించే పదార్దంగా ఉంటుంది. అంటే బాదం నుండి పొందిన ఇనుము, జింక్ మరియు కాల్షియం పరిమాణంలను తగ్గిస్తుంది.

English summary

Here are the health benefits of almonds. Almonds are also high in phytic acid, a substance that binds certain minerals and prevents them from being absorbed. This means that the amount of iron, zinc and calcium you get from the almonds will be reduced somewhat.