అరటిపండు ప్రయోజనాలు

Health Benefits of banana

04:01 PM ON 27th January, 2016 By Mirchi Vilas

Health Benefits of banana

అరటి పండు అనేది ప్రకృతి ఇచ్చిన గొప్ప అల్పాహారాల్లో ఒకటి. కానీ అది మనకు ఎంత మంచి చేస్తుందో తెలుసా? అరటిపండులో అనేక అసాదారణ ఉపయోగాలు ఉన్నాయి.

1/11 Pages

1. పొటాషియం

అరటిపండులో పొటాషియం సమృద్దిగా ఉంటుంది. ఈ ఖనిజం గుండె పనితీరును సరిగ్గా నిర్వహించడం మరియు సాధారణ రక్తపోటు నియంత్రణకు చాలా అత్యవసరం. అనేక అధ్యయనాలలో అధిక రక్తపోటును తగ్గించటానికి పొటాషియం సమృద్దిగా ఉన్న ఆహారాలు సహాయపడతాయని తెలిసింది. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్
(FDA) వారు అధిక రక్తపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించే సామర్ధ్యం అరటి పండుకు ఉందని  అరటి ఇండస్ట్రీ ( ఫార్మాస్యూటికల్ డ్రగ్ తయారీ చేస్తారు) కి అనుమతి ఇచ్చింది.

మెడిసిన్ న్యూ ఇంగ్లాండ్ జర్నల్ మరింత పరిశోధన చేసి, ఆహారంలో క్రమం తప్పకుండా అరటిపండు తింటే  స్ట్రోక్ ప్రమాదం 40 శాతం తగ్గుతుందని తెలిపింది. అరటి పండులో ఉండే పొటాషియం మూత్రపిండాలు మరియు ఎముకలకు చాలా సహాయపడుతుంది. పొటాషియంను సమృద్దిగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లకు కారణం అయిన కాల్షియం మూత్రంలో విసర్జన జరగకుండా సహాయపడుతుంది.

బోలు ఎముకల వ్యాధి మరియు ఎముకల పెళుసు అభివృద్ధి ప్రమాదాన్ని కాల్షియం తగ్గిస్తుంది.ప్రతి రోజు ఒక అరటి పండు తింటే  కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ప్రయోజనం చేకూరుతుంది.

English summary

Here are the some health tips. That is benefits of banana. Banana are among the most convenient food sources of potassium,vitamin C and particularly high in vitamin B6. Banana benefits for more energy, better health and even improving the way you look and feel.