రాగి నీటితో లాభాలు

Health benefits of copper water

12:59 PM ON 23rd April, 2016 By Mirchi Vilas

Health benefits of copper water

పూర్వం చాలా మంది రాగి పాత్రలను ఎక్కువగా వాడేవారు. అలాగే మట్టి పాత్రలు, సిల్వరు పాత్రలు, కూడా వాడేవారు. కాని ఇప్పుడు ఉన్న జనరేషన్ మాత్రం చాలా మారిపోయింది. చాలామంది ప్యాషన్నే ఫాలోఅవుతున్నారు. పింగాని పాత్రలు, ప్లాస్టిక్ గిన్నెలు, గాజు పాత్రలను ఎక్కువగా వాడుతున్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్  కవర్స్ ని  వాడకూడదని చెప్పినా సరే  వాటినే వాడుతున్నారు తప్ప వాడడం మానడం లేదు. ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు. కాని రాగి పాత్రలో మంచి నీళ్ళను ప్రతిరోజు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చాలా మంది చెబుతుంటారు. అయితే దాని వల్ల ఏ విదమైన ఆరోగ్యం కలుగుతుందో,  ఏదైనా హాని కలుగుతుందా ? లేక మన పెద్దవాళ్ళ మూడ నమ్మకమా ? ఇలాంటివి చాలా విషయాలు మనల్ని వేదిస్తుంటాయి. అలాంటి విలువైన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

1/9 Pages

ప్లాస్టిక్, మట్టి, రాగి పాత్రలపై పరిశోధన

కొత్తగా మైక్రో బయాలజిస్ట్ పరిశోధకులు  ఒక ప్లాస్టిక్, మట్టి ఇంకా రాగి గిన్నెలతో ఒక పరిశోధన చేపట్టారు. విరోచనాకారి అయిన బ్యాక్టీరియాతో కూడిన నీటిని  ఈ మూడు గిన్నెలలోకి తీసుకుని  48 గంటల తర్వాత  ఆ నీటిపై పరిశోదన చేయగా తెలిసినది ఏమిటంటే రాగి పాత్రలో ఉన్న బాక్టీరియా శాతం తగ్గింది కాని ప్లాస్టిక్ మరియు మట్టి పాత్రలో ఉన్న బాక్టీరియా శాతం రెండింతలు పెరిగింది. దీంతో మీకు కుడా రాగి  పాత్రలపై  ఒక క్లారిటీ వచ్చింది కదూ..

English summary

Here we have listed about some health benefits of copper water. You drink water from a copper vessel to reap numerous health benefits.