వెల్లుల్లిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Garlic

01:05 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Health benefits of Garlic

పురాతన కాలం నుంచి వెల్లుల్లి వంటగదిలో ఒక సాదారణ పదార్దంగా ఉంది. దీనిలో ఉండే ప్రత్యేక లక్షణాలు కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. నేటికీ అనేక సంస్కృతుల వారు అనుసరిస్తున్నారు. మా పూర్వీకులు దోషాలను తిప్పికొట్టటానికి ఉపయోగించేవారు. ప్లేగు వ్యాధికి వ్యతిరేకంగా మధ్యయుగ యూరోప్ మరియు ఈజిప్షియన్లు కూడా చనిపోయిన వారితో పాటు వెల్లుల్లిని భూస్థాపితం చేసేవారు.

వేల్లుల్లిలో సల్ఫర్, అల్లిసిన్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కొన్ని రకాల  క్యాన్సర్ లను నిరోదించటానికి సహాయపడతాయి. 100 గ్రాముల వెల్లుల్లిలో 150 కేలరీలు, 33 గ్రాముల పిండి పదార్థాలు, 6.36 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. అలాగే వెల్లుల్లిలో  విటమిన్ B1, B2, B3, B6, ఫోలేట్, విటమిన్ సి, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, సోడియం మరియు జింక్ సమృద్దిగా ఉంటాయి.

వెల్లుల్లిలో అధిక సల్ఫర్ ఉండుట వలన అది  యాంటిబయోటిక్ లక్షణాలను కలిగించి శరీరంలో విషాన్ని బయటకు పంపి జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచటంలో సహాయపడుతుంది. సాధారణ జలుబుకు వ్యతిరేకంగా నిరోధకతను పెంచుతుంది. అంతేకాక ధమనుల బ్లాక్స్ ని క్లియర్ చేసి గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. ఇక్కడ వెల్లుల్లి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

1/7 Pages

1. రక్తాన్ని శుద్ది చేస్తుంది

రక్తాన్ని శుద్ది చేయటం ద్వారా మొటిమలకు కారణం అయిన మూలాన్ని తొలగించి ఆరోగ్యకరమైన చర్మం కొరకు సహాయపడుతుంది. ఉదయం గోరు వెచ్చని నీటితో రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. బరువు కోల్పోవాలని అనుకున్నప్పుడు, ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసం కలిపి రెండు వెల్లుల్లి రెబ్బలతో తీసుకోవాలి. వెల్లుల్లి మన వ్యవస్థను శుభ్రపరచడానికి మరియు విషాన్ని బయటకు పంపటానికి సహాయపడుతుంది.

English summary

Here are the health benefits of Garlic. In garlic have high sulphur content it gives it antibiotic properties, helping keep the digestive system clean by flushing out toxins. It is great for rejuvenation and healing of skin scars and gives a glow to the skin