అందానికి ఆరోగ్యానికి మేలు చేసే జామ ఆకులు

health benefits of guava tree leaves

10:59 AM ON 27th December, 2015 By Mirchi Vilas

health benefits of guava tree leaves

మెక్సికో మరియు అమెరికా దేశాలలోని  వివిధ ప్రాంతాలలో పుట్టిన జామ పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మనలో చాలా మందికి జామ పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసు.  కానీ జామ ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు.జామ ఆకులో ఉండే లక్షణాలు కారణంగా అనేక సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. మనకు తెలియని,జామ ఆకు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.

1/17 Pages

క్యాన్సర్

జామ ఆకు రసాన్ని తగిన మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది. జామ ఆకులో విటమిన్ సి, లైకోపీన్, పాలీ-ఫినాల్స్ వంటి సహజ రసాయన సమ్మేళనాలు ఉండుట వలన క్యాన్సర్ కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. అంతేకాక జామ ఆకులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్  ఫ్రీ రాడికల్ పెరుగుదలను అరికట్టి పెద్దప్రేగులో విష  ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఆహారం ద్వారా వచ్చే కొవ్వు నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

English summary

guava tree leaves benefits, health tips, beauty tips